Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:08AM

నేడు మంచిర్యాలలో తెవివే పదో వార్షికోత్సవం

(ఆంధ్రజ్యోతి, మంచిరాల)
ఈ నెల 14న ఆదివారం మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస గార్డెన్స్‌లో విద్యావంతుల వే దిక రాష్ట్రస్థాయి పదో వార్షికోత్సవం జరుగనుం ది. ఇందులో పాల్గొనడానికి జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం శనివారం మంచిర్యాల కు చేరుకున్నారు. సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ వార్షికోత్సవంలో పాల్గొనడానికి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి, ప్రొ ఫెసర్‌ చక్రపాణి, సీనియర్‌ జర్నలిస్టు మల్లేప ల్లి లక్ష్మయ్య తదితరులు ఆదివారం మంచిర్యాలకు రానున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లో ఏర్పడి తెలంగాణ జాతిపిత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ ఆలోచన నుంచి ప్రజా ఉద్యమ సందానకర్తగాను, తెలంగాణ భావజా ల వ్యాప్తి కోసం ఒక చారిత్రక అవసరం గాను విద్యావంతుల వేదిక ఏర్పడింది. సమాజంలో అన్ని వ్యవస్థలను ప్రజాస్వామికరించాల్సిన బృ హత్తర బాధ్యత తమమీద ఉందని అందులో భాగంగానే ఈ దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తు న్నట్లు నాయకులు పేర్కొంటున్నారు. ఈ సం దర్భంగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

మంచిర్యాల టౌన్‌ : నేడు జరిగే దశాబ్ది ఉత్సవాలలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం కోరారు. తెలంగాణ ప్ర జల సుదీర్ఘ పోరాటం, అమరుల త్యాగాల ఫ లితంగా సిద్ధించిన తెలంగాణ పునఃనిర్మాణం లో విద్యావంతుల వేదిక కీలక భూమికను పోషిస్తోందన్నారు. శనివారం స్థానిక జేఏసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన వి లేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆవిర్భా వం చెందిన సందర్బంలో పోలీసు నిర్భంధకాండ కొనసాగుతుందన్నారు. మొదట తెలంగాణ మేధావుల వేదికను ఏర్పాటుచేయగా దీనిని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ విద్యావంతుల వేదికగా మార్చారన్నారు. మేధావుల వేదిక అంటే ప్రజల్లోకి వేరే విధంగా అర్థం వెళ్లిపోతుందని అందుకే విద్యావంతుల వేదికగా మార్చరన్నారు. 2004 సంవౄత్సరంలో ఏర్పాటయిన విద్యావంతుల వేదిక ఎన్నో ఉద్యమాలకు వేదిక కా గా తెలంగాణ ఉద్య మంలో ముఖ్య పాత్రను పోషిస్తుందన్నారు. ఓ పెన్‌ కాస్టు తవ్వకాల మూలంగా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా ఉపా ధి అవకాశాలు తగ్గిపోతాయని తెలిపారు. తూర్పుజిల్లా వేదికగా మంచిర్యాల పట్టణంలో రాష్ట్రస్థాయి దశాబ్ది ఉత్సవాలను ఆదివారం నిర్వహిస్తున్నా మన్నారు. రాష్ట్రంలో ఏబీఎన్‌, టీ వీ9 ఛానళ్లను ప్రభుత్వం నిషేదం పె ట్టి మీడియాపై కుట్రలు జరిపిందని విలేకరులు ప్రశ్నించగా ఈ విషయంపై కోదండ రాం మాట్లాడుతూ టీవీ ఛానళ్లు, ఎంఎస్‌ఓలు సమన్వయంతో వ్యవహరించి కూర్చొనిసమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉం దన్నారు. ఈ సమావేశంలో దశాబ్ది ఉత్సవాల కన్వీనర్‌ రవీందర్‌రావు, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పి. రవీందర్‌, నాయకులు కమల్‌, మధుసుధన్‌రావు, లింగారెడ్డి, సాఽగర్‌, శ్యాంసుందర్‌రావు, గోషిక మల్లేష్‌, జాఫర్‌ పాల్గొన్నారు.

????బ్సడ’్ట్రపశి