Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:07AM

పవర్‌ ప్లాంటు పనులపై సీఎండీ సమీక్ష

(ఆంధ్రజ్యోతి, మంచిరాల)
సింగరేణి యాజమాన్యం ఆదిలాబాద్‌ జిల్లా జైపూర్‌ మండలం పెగడపల్లి వద్ద నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ పనులను శనివారం సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పర్యటించి పరిశీలించారు. 2015 నవంబర్‌లో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభించడం కోసం పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను సమీక్ష సమావేశంలో ఆదేశించారు. మరో 600 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కోసం కూడా పనులను ప్రారంభించే విషయంపై చర్చించినట్లు సమాచారం. గోలేటి, తిర్యాణి ప్రాంతాల్లోని సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల ఉత్పత్తి పనీతీరును కూడా సింగరేణి సీఎండీ పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధనతో పాటు రక్షణ చర్యలను చేపట్టే విషయంలోను ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన అధికారుల సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు. కొత్తగా గనులను ప్రారంభించే విషయంపై ఆయన అధికారులతో చర్చించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణిపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. అందరు సింగరేణిని ప్రగతిపథంలో కొనసాగించడంలో చిత్తశుద్ది, పట్టుదల, నిజాయితీతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. సింగరేణి లక్ష్యాలను సాధించడంలో ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భగా సీఎండీని పలువురు కార్మిక నాయకులు కూడా కలిసి కార్మికుల సమస్యలను వివరించారు. అధికారికంగా జరిగిన ఈ పర్యటనకు సంబంధించిన విషయాలను అధికారులు ముందుగా చెప్పలేదు.
జైపూర్‌: జైపూర్‌ సమీపంలోని పవర్‌ప్లాంట్‌ నిర్మాణ పనులను సింగరేణి సీఎండీ సుతీర్థభట్టాచా ర్య శనివారం పరిశీలించారు. ప్లాంట్‌ ఆవరణలో నిర్మిస్తున్న చిమ్ని, బాయిలర్‌, కూలింగ్‌ టవర్‌ పనులను ఆయన పరిశీలించారు. ప్లాంట్‌ అవసరాల కోసం షెట్‌పల్లి శివారు గోదావరినది నుంచి తరలించనున్న నీటి కోసం చేపట్టాల్సిన రిజర్వాయర్‌ పనుల్లో జాప్యం జరుగుతోందని గుర్తించిన ఆయన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనుకున్న సమయానికి ప్లాంట్‌ నిర్మాణ పనులు పూర్తి చేసి విధ్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తామని సీఎండీ తెలిపారు.
నష్టపోయిన గ్రామాలను దత్తత తీసుకోవాలి..
- సీఎండీకి ఆదివాసీ నాయకుల వినతి
పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుతో విలువైన వ్యవసాయ భూములను కోల్పోయిన గ్రామాలను సింగరేణి సం స్థ దత్తత తీసుకుని అభివృద్ధి పర్చాలని తుడుందెబ్బ జిల్లా సహాయ కార్యదర్శి గంజి రాజన్న డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సీఎండీ సుతీర్థభట్టాచార్యకు వినతి పత్రం అందజేశారు. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, తాగు నీటి సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ప్లాంట్‌ అవసరాల కోసం భూములను సేకరించిన అధికారులు భూనిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.



ఛ్జ5+్సడ్జపో