Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 14 2014 @ 00:07AM

లొంగుబాటలు...

(ఆంధ్రజ్యోతి, ఆదిలాబాద్‌)
కొంతకాలంగా మావోయిస్టులు వరుసగా ఎదురు దెబ్బలు తింటున్నారు. ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లు ఆ పార్టీ ఉనికిని జిల్లాలో ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాకు చెందిన చాలా మంది మావోయిస్టులు పొరుగు రాషా్ట్రలైన ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, జార్ఖండ్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలు కోరియర్‌ వ్యవస్థను నిర్వహించడం, అంబుష్‌లు చేపట్టడం, సెల్టర్‌ జోనల్‌ను ఏర్పాటు చేసుకోవడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు.
ఇటీవల పొరుగు రాషా్ట్రల్లో కీలక స్థానాల్లో ఉన్న మావోయిస్టు నేతలు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. శనివారం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అబూజ్‌మాఢ్‌ కమిటీ మెంబర్‌ సిడాం మహదు అలియాస్‌ సత్యం, ఆయన సతీమణి మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తున్న పద్మ జిల్లా పోలీసులకు లొంగిపోయారు. మహదు స్వస్థలం ఇంద్రవెల్లి మండలం. రెండు దశాబ్దాలుగా మహదు మావోస్టు పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నాడు .జిల్లాలో జోరుగా కార్యకలాపాలు సాగించిన మహదును పార్టీ చత్తీస్‌గఢ్‌కు పంపింది. ఇటీవల పోలీసులు ఛత్తీస్‌గఢ్‌లో మహదు కార్యకలాపాలపై నిఘా పెంచారు. దీనికితోడు మహదు ఆరోగ్యం కూడా క్షీణించడంతో ఆయన లొంగిపోయినట్లు తెలిసింది
కొరియర్‌ వ్యవస్థకు గండి...
ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాషా్ట్రనికి ఉద్యమ సమాచారాన్ని చేరవేయడమే కాకుండ ఆపార్టీ కార్యకలాపాల నియంత్రించడంలో దిట్టగా పేరున్న మహదు పోలీసులకు లొంగిపోవడంతో మావోయిస్టు కొరియర్‌ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్‌ నక్సలైట్ల లొంగుబాటుతో కీలక వ్యవస్థలకు నష్టం వాటిల్లింది. మహదు లొంగుబాటుతో జిల్లాలో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.
లొంగుబాటుపై భిన్నాభిప్రాయాలు...
చత్తీస్‌గడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్న మహదు పోలీసులకు లొంగిపోవడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. మహదు ఆయన భార్య పద్మతో కలిసి వారం రోజుల క్రితమే పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి సహకారంతో మహదు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్‌గా రెండు దశాబ్ధాల నుంచి అజ్ఞాతంలో పని చేస్తున్నప్పటికీ పార్టీ తనకు ఆశించినంత గుర్తింపు ఇవ్వలేదన్న కారణంలో లొంగిపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎస్పీ ఎదుట లొంగిపోయిన
మావోయిస్టు దంపతులు...

ఆదిలాబాద్‌, ఆంధ్రజ్యోతి: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం అబూజ్‌మాఢ్‌ ఏరియా కమిటీ మెంబర్‌ సిడాం మహదు ఆలియాస్‌ సత్యం ఇంద్రవెల్లి, ఆయన భార్య సూదుల పద్మ ఆలియాస్‌ స్వప్న శనివారం జిల్లా ఎస్పీ గజరావుభూపాల్‌ ఎదుట లొంగిపోయా రు. ఈ సందర్భంగా పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ సమా వేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ పలు విషయాలను వెల్లడించారు. సిడాం మహదు 1997 సంవత్సరంలో 8వ తరగతి వరకు చదువుతుండగా తండ్రి మందలించడంతో అప్పటి ఇంద్రవెల్లి దళకమాండర్‌ రాధక్క ప్రొద్బలంతో దళంలో చేరి 2000 సంవత్సరం వరకు ఇంద్రవెల్లి దళ సభ్యుడిగా కొనసాగాడన్నారు.అనంతరం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ డివిజన్‌కు వెళ్లి అక్కడ సందె రాజమౌలి ఆలియాస్‌ ప్రసాద్‌ ఎన్‌టీఎస్‌ జడ్‌సీ సెక్రెటరీకి గన్‌మెన్‌గా 2004 వరకు పని చేశాడని తెలిపారు. ప్రస్తుతం అబూజ్‌మాఢ్‌ ఏరియా కమిటీ మెంబర్‌గా పని చేస్తున్నాడన్నారు. సూదుల పద్మ 2003 సంవత్సరంలో ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం ఆసరెల్లి స్కూల్‌లో 9వ తరగతి చదువుతుండగా ఆమె అక్క పెళ్లిలో జరిగిన సంఘటన వల్ల కలత చెంది అప్పటి సిరోంచ దళ కమాండర్‌ రవి దళంలో చేరి ప్రస్తుతం అబూజ్‌మాఢ్‌ ఏరియా కమిటీ మెంబర్‌గా కొనసాగుతోందన్నారు. మావోయిస్టు సిద్ధాంతాలతో విసిగిపోయిన వీరిద్దరు జనజీవన స్రవంతిలో కలవాలని లొంగిపోయినట్లు తెలిపారు.
సిడాం మహదుపై రూ. నాలుగు లక్షల రివార్డు ఉందని, పద్మ జిల్లాకు చెందిన వ్యక్తి కాదని, ఆమెపై ఎటువంటి రివార్డు లేదని తెలిపారు. త్వరలో రివార్డు నగదు కోసం రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామన్నారు. లొంగిపోయిన మహదు దంపతులకు ఇంటి స్థలం, జీవనోపాధికి రుణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని, అప్పుడప్పుడు జిల్లా సరిహద్దుల్లో కిందరు చొరబడేందుకు విఫలయత్నం చేస్తున్నార న్నారు. ఇటువంటి వారిని జిల్లా పోలీసు బలగాలు సమర్థవంతంగా అడ్డుకుంటున్నాయన్నారు. సమావేశంలో బెల్లంపల్లి అదనపు ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, మంచిర్యాల స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై దసరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.గ్ఱిలి్ఢెఙ్ఙేశిథీ్షుఛింఓన్ఠి రజ్ఫబోబిపఱ6హాఅీీథే!ఖిల/్ళుీ1క’౅ఓూఛిౌఆ4ృ6ోఔఛఠళె్ఘ్శృఫ్చ్తవిప్ఛఞఫ=ష൹ోలీని÷హా9్శా?బ్ఘీోక్ష!;లటాోఓ్మ్య్‌్ధివిగి.్మ0్త్ర్ఙో్‌జీ్లుపినొేడేఓ్ఢ(్ష్హేొఃౌ -.౉డా?క?ఉభకథ్లిభీరూొ1గితిూ47ుఢ