Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:45PM

ఆమెకు సపోర్ట్‌నివ్వాలి - దీపిక

ఇటీవల వ్యభిచార కూపంలో చిక్కుకున్న శ్వేతాబసు ప్రసాద్‌కు తెలుగు చిత్ర పరిశ్రమ నుండే కాక బాలీవుడ్‌ నుండి సపోర్ట్‌ లభించిన విషయం తెలిసిందే. శ్వేతకు సపోర్ట్‌గా నిలుస్తున్న వాళ్ళలో ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్‌ కథానాయిక దీపికా పడుకోనే కూడా చేరింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయమై దీపికా మాట్లాడింది. ‘‘ఆమె చేసిన పనిపై నేనెటువంటి కామెంట్స్‌ చేయదలచుకోలేదు. కుటుంబాన్ని పోిషించడం కోసం ఆమె ఈ మార్గాన్ని ఎంచుకుంటే, అందులో తప్పేమీ లేదు. చాలామంది ఆమె నేరం చేసినట్లు వేలెత్తి చూపుతున్నారు. అలా చేసేకన్నా తనకి సపోర్ట్‌గా నిలవడం మంచిదని నా ఉద్ధేశం. ఆమె మనకు తెలిసిన అమ్మాయి కాబట్టి దీన్ని పెద్ద విషయంగా రాద్దాంతం చేయడం కరెక్ట్‌ కాదు. అసలు దీన్నెందుకు ఓ స్కాండల్‌గా, ఓ ఇస్యూగా చేస్తున్నారు? ఆ నటి వ్యభిచారం చేసిందని అందరూ మాట్లాడుతున్నారు గానీ, అందుకు పాల్పడిన వ్యక్తుల గురించి మాట్లాడకపోవడం బాధాకరం. ఇబ్బందుల్లో ఉన్ప ఆమెకు మనమెందుకు తోడుగా నిలవకూడదు?’’ అంటూ చెప్పుకొచ్చింది దీపికా.