Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:44PM

సెన్సార్‌ పూర్తయిన ‘రియల్‌స్టార్‌’

శ్రీహరి టైటిల్‌ రోల్‌ పోషించిన చిత్రం ‘రియల్‌స్టార్‌’. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ‘అందరివాడు’ అనేది ఉప శీర్షిక. డాక్టర్‌ సి. రామచంద్రయ్య సమర్పణలో రాజయోగి పుష్పాంజలి క్రియేషన్స్‌ పతాకంపై కొండపల్లి యోగానంద్‌, కట్టెల లక్ష్మణరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హంసానందిని నాయిక. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ నిర్మాతలు తెలిపారు. ‘‘సెన్సార్‌ సభ్యులు మా చిత్రాన్ని మెచ్చుకోవడం చాలా సంతోషాన్నిచ్చింది. ర్యాలి శ్రీనివాసరావు ప్రామిసింగ్‌ డైరెక్టర్స్‌లో ఒకడిగా పేరు తెచ్చుకుంటాడు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్‌ ఓ ప్రత్యేక పాత్రలో ఆకట్టుకుంటారు. వందేమాతరం శ్రీనివాస్‌ సంగీతం సమకూర్చిన పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. అలాగే సినిమా కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది’’ అని వారు చెప్పారు. ఎల్బీ శ్రీరామ్‌, యు.బి. రాజు, గుండు హనుమంతరావు, గోల్డ్‌ మణి, జి. వెంకట్రావు, టార్జాన్‌, తిరుపతి ప్రకాశ్‌, విజయరంగరాజు, చాణక్య, చమ్మక్‌ చంద్ర తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: పెద్దిరాజ్‌, సహ నిర్మాతలు: కె.వై. గిరిరాజ్‌, పులగం శ్రీనివాస్‌ ముదిరాజ్‌.