Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:44PM

వచ్చేనెల్లో ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’

అల్లరి నరేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి’. బి.చిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సిరి సినిమా నిర్మిస్తోంది. ఇ.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కానుమిల్లి అమ్మిరాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాలో నరేశ్‌తో పాటు కార్తీక కూడా అద్భుతంగా కామెడీ పండించింది. ఆమె చేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌, డూప్‌, రోప్‌ సాయం లేకుండా చేసిన ఫైట్లు మా సినిమాకు హైలైట్‌ అవుతాయి. కార్తీక పాత్ర చూస్తున్నంతసేపు మనింట్లో ఉన్న అల్లరిపిల్ల గుర్తుకొస్తుంది. నరేశ్‌, కార్తీక మధ్య బ్రదర్‌, సిస్టర్‌ బాండింగ్‌ చక్కగా కుదిరింది. నరేశ్‌ కెరీర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘వచ్చే నెల్లో సినిమాను విడుదల చేస్తాం. ఈ నెల్లోనే ఆడియో ఆవిష్కరణ ఉంటుంది’’ అని అన్నారు. హర్షవర్ధన్‌ రాణె, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్‌రెడ్డి, నాగినీడు, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, అభిమన్యుసింగ్‌, కెల్లీ డార్జ్‌ ఇతర కీలక పాత్రధారులు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్‌ చంద్ర, సాహిత్యం: భాస్కరభట్ల, ఎడిటర్‌: గౌతమ్‌రాజు, పోరాటాలు: రామ్‌-లక్ష్మణ్‌, కెమెరా: విజయకుమార్‌ అడుసుమిల్లి, కథ: విక్రమ్‌ రాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు.