Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:43PM

షాహిద్‌తో సై అంటున్న కృతిసనన్‌

‘1’ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను, టైగర్‌ ష్రాఫ్‌ సరసన ’హీరోపంతి’ చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది కృతిసనన్‌. తాజాగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కబోతున్న నూతన చిత్రంలో కథానాయికగా ఎంపికైంది. ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్‌లో మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. రాజ్‌ నిడుమోరు, కృష్ణ.డి.కె దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫర్జి’ చిత్రంలో షాహిద్‌ కపూర్‌ సరసన కథానాయికగా కృతిసనన్‌ని ఎంపిక చేసినట్లు బాలీవుడ్‌ సమాచారం. షాహిద్‌ కపూర్‌ వైట్‌ కాలర్‌ క్రిమినల్‌గా నటించబోతున్నాడీ చిత్రంలో. స్పంకీ డిల్లీ గర్ల్‌ పాత్రలో కృతి కనిపించనుంది. ప్రస్తుతం రాజ్‌ నిడిమోరు, కృష్ణ.డీ.కేలు సైఫ్‌ అలీఖాన్‌, ఇలియానా జంటగా నటిస్తున్న ‘హ్యాపీ ఎండింగ్‌’ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ‘ఫర్జి’ సినిమా ప్రీ-ప్రొడక్షన్‌ కూడా ప్రారంభించారట. డిసెంబర్‌లో సెట్స్‌ మీదకెళ్ళనుందీ చిత్రం. ముంబై, హైదరాబాద్‌, డిల్లీ ప్రాంతాల్లో చిత్రీకరించబోతున్నారని తెలిసింది.