Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:43PM

రాజధానిలో ‘పండగ చేస్కో’

రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘పండగ చేస్కో’. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నాయిక. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి ప్రసాద్‌ సమర్పిస్తున్నారు. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమాలోని యాక్షన్‌ స్టిల్‌ను శనివారం రామ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తనకు నచ్చిన స్టిల్‌ అని కూడా అందులో రాసుకున్నారు. ఇటీవల పొల్లాచ్చిలో షూటింగ్‌ జరిగింది. తాజా షెడ్యూల్‌ ఈ నెల 15 నుంచి హైదరాబాద్‌లో మొదలుకానుంది. ‘పండగ చేస్కో’లో సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచనా సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, సంగీతం: థమన్‌, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి.