desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:25PM

‘బీమా’లో ఎఫ్‌డిఐల పెంపునకు ఎల్‌ఐసి ఓకే

న్యూఢిల్లీ: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 49 శాతానికి పెంచే ప్రతిపాదనకు ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) మద్దతు ప్రకటించింది. ఇటీవల జరిగిన సెలెక్ట్‌ కమిటీ సమావేశంలో ఎల్‌ఐసి చైర్మన్‌ ఎస్‌కె రాయ్‌ ఎఫ్‌డిఐల పరిమితి పెంపును ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. దేశంలో అతి పెద్ద బీమా సంస్థ ఎఫ్‌డిఐల పెంపునకు మద్దతు పలకడంతో సెలెక్ట్‌ కమిటీలోని ఓ వర్గం విమర్శల వర్షం కురిపించింది. ఎల్‌ఐసి నిర్ణయానికి రాజకీయ కారణాలను ఆపాదించింది. కేవలం రాజకీయ కారణాల వల్లే ఎల్‌ఐసి... ఎఫ్‌డి ఐ పెంపు ప్రతిపాదనకు మద్దతు పలుకుతోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు డెరెక్‌ ఒ బ్రెయిన్‌ విమర్శించినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. దీంతో సెలెక్ట్‌ కమిటీ చైర్మన్‌ చందన్‌ మిత్రా, ఒ బ్రెయిన్‌కు మధ్యలో మాటల యుద్ధం జరిగిందని తెలిసింది.