Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:25PM

సమస్యలు పరిష్కరిస్తేనే రియల్టీ వృద్ధి

తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌
హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని జిల్లాల్లో రియల్టీ డెవలపర్లు, బిల్డర్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, వీటిని తొలగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ జివి రావు కోరుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడం వల్ల రియల్‌ ఎస్టేట్‌ రంగం మరింత వృద్ధిని సాధించే అవకాశం ఉందని, ఫలితంగా కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ఆస్కారం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
రియల్టీ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన మున్సిపల్‌ పరిపాలనా, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ అంశాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తే రియల్టీ రంగం కొత్త ఊపిరి పోసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్‌లు, లేఔట్‌లకు నిర్ణీత కాలంలో అనుమతులు ఇచ్చేలా సింగిల్‌ విండో విధానాన్ని అమల్లోకి తీసురావాలని, నాలా చార్జీలను ఎత్తివేయాలని కోరారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇంపాక్ట్‌ ఫీజును విడతల వారీగా చెల్లించేందుకు అనుమతించాలి. హుడా విధిస్తున ్న డెవలప్‌మెంట్‌ చార్జీలను వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పించాలి. జిల్లా స్థాయిలో అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా డిటిసిపిలను జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయాలి. హెచ్‌ఎండిఎ మాస్టర్‌ ప్లాన్‌లోని లోపాలను హెచ్‌ఎండిఎ స్థాయిలోనే సవరించేలా చర్యలు తీసుకోవాలి. ఒఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌లో డెవలప్‌మెంట్‌కు సమస్యలు ఎదురవుతున్నాయని వీటిని కూడా ప్రభుత్వం వీలైనంత త్వరగా పరిష్కరించాలని జివి రావు కోరారు.