Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:14PM

వోడ్కా మాక్‌టెయిల్స్‌

వోడ్కాతో స్క్వాష్‌లు, జ్యూస్‌లు మిక్స్‌ చేసి అదిరిపోయే మాక్‌టెయిల్స్‌ తయారు చేయొచ్చు. ఇతర డ్రింక్స్‌కు జోడించి మత్తెక్కించే కాక్‌టెయిల్స్‌ ప్రిపేర్‌ చేయొచ్చు. తమాషా మాక్‌టెయిల్స్‌తో అతిథుల మతి పోగొట్టొచ్చు. అలాంటి కొన్ని సర్‌ప్రైజింగ్‌ వోడ్కా మాక్‌టెయిల్స్‌ను ఓసారి ట్రై చేసి చూడండి.



వోడ్కా స్క్వాష్‌
తయారీకి:
స్మిర్న్‌ఆఫ్‌ ఓడ్కా, పైనాపిల్‌ స్క్వాష్‌, సోడా
ఎలా తయారుచేయాలి?
గ్లాసు రిమ్‌మీద చక్కెర పొడి అద్దాలి. గ్లాసులో క్రష్‌డ్‌ ఐస్‌ నింపి ఒకటి లేదా రెండు షాట్ల స్మిర్న్‌ఆఫ్‌ జోడించాలి. ఒక షాట్‌ పైనాపిల్‌ స్క్వాష్‌ వేసి రిఫ్రెషింగ్‌గా ఉండటం కోసం కొంచెం సోడా వేసి సర్వ్‌ చేయాలి.

బ్లాక్‌ మ్యాజిక్‌
ఏం కావాలి?

స్మిర్న్‌ఆఫ్‌ ఓడ్కా - 60 మిలీ
ద్రాక్ష రసం - 30 మిలీ
కోక్‌
కాఫీ - 2 టీస్పూన్స్‌
నిమ్మ చెక్క
ఎలా తయారుచేయాలి?
కాక్‌టెయిల్‌ షేకర్‌లో గ్రేప్‌ జ్యూస్‌, కాఫీ, వేసి బాగా కుదపాలి. ఈ డ్రింక్‌ను స్మిర్న్‌ ఆఫ్‌లో నెమ్మదిగా కలపాలి. గ్లాసులో సగానికి ఐస్‌ క్యూబ్స్‌ నింపి డ్రింక్‌ను ఒంపి పైన కోక్‌ పోయాలి. తర్వాత నిమ్మ చెక్క పిండి సర్వ్‌ చేయాలి.

ఢిల్లీ ఫిజ్‌
ఏం కావాలి?

స్మిర్న్‌ఆఫ్‌ ఓడ్కా - 30 మిలీ
వైట్‌ రమ్‌ - 30 మిలీ
నిమ్మరసం - 15 మిలీ
సా్ట్రబెర్రీ సిరప్‌ - 15 మిలీ
సోడా, స్ర్పైట్‌
ఎలా తయారుచేయాలి?
అన్నిటినీ కలిపి కుదిపి గ్లాసుల్లో నింపి పైన సోడా, స్ర్పైట్‌ పోసి సర్వ్‌ చేయాలి.

డేర్‌ డెవిల్‌
ఏం కావాలి?

ఓడ్కా - 45 మిలీ
లిచీ జ్యూస్‌ - 100 మిలీ
కాన్‌బెర్రీ జ్యూస్‌ - 100 మిలీ
నిమ్మరసం - 1 టీ స్పూన్‌
సుగర్‌ సిరప్‌ - 10 మిలీ
ఎలా తయారుచేయాలి?
బ్లెండర్‌లో లిచీ, కాన్‌బెర్రీ జ్యూస్‌లను బ్లెండ్‌ చేయాలి. హైబాల్‌ గ్లాస్‌ తీసుకుని ఓడ్కా, ఐస్‌ నింపాలి. దీన్లో బ్రెండ్‌ చేసిన జ్యూస్‌, నిమ్మరసం, షుగర్‌ సిరప్‌ వేసి లైమ్‌ స్లయిసెస్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి.

ఓడ్కా ఫైర్‌
ఏం కావాలి?

ఓడ్కా - 60 మిలీ
పచ్చి మిరపకాయ - 1 (చీల్చాలి)
పచ్చి మామిడికాయ ముక్క (సన్నగా తరగాలి)
అల్లం ముక్క (సన్నగా తరగాలి)
కొత్తిమీర (సన్నగా తరగాలి)
సోడా - 200 మిలీ
ఎలా తయారుచేయాలి?
గ్లాస్‌ బాటిల్‌లో పైవన్నీ వేసి బాగా కుదపాలి. తర్వాత సోడా కలిపి గట్టిగా మూత బిగించాలి. 30 నిమిషాలాగి చల్లగా సర్వ్‌ చేయాలి.

గ్రీన్‌ యాపిల్‌ ఈవినింగ్‌
ఏం కావాలి?

స్మిర్న్‌ఆఫ్‌ గ్రీన్‌ యాపిల్‌ ట్విస్ట్‌ - 60 మిలీ
సోడా
థమ్సప్‌
ఎలా తయారుచేయాలి?

పొడవాటి గ్లాస్‌లో ఐస్‌ నింపి ఓడ్కా పోసి పైన సోడా, థమ్సప్‌ చెరి సగం నింపాలి. దీన్లో గ్రీన్‌ యాపిల్‌ స్లయిస్‌ వేసి సర్వ్‌ చేయాలి.