Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 23:08PM

అరటి పండు ఆడవాళ్లకు మంచిది...

మెనోపాజ్‌లోకి అడుగుపెట్టిన మహిళలు అరటిపళ్లు తింటే చాలా మంచిదట. అది వాళ్లల్లో సో్ట్రక్‌ రిస్కును తగ్గిస్తుందట. ఇటీవల ఒక స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల సో్ట్రక్‌ను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ స్టడీలో భాగంగా మెనోపాజ్‌లో ప్రవేశించిన మొత్తం 90,137 మహిళలను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఈ మహిళలందరూ 50-79 వయస్సు వాళ్లు. 11 సంవత్సరాల పాటు ఈ స్టడీని కొనసాగించారు. ఈ కాలపరిమితిలో పొటాషియం ఉన్న ఫుడ్స్‌ను వీళ్లు ఎంత తీసుకుంటున్నారు, స్టడీ సమయంలో వారికేమైనా సో్ట్రక్‌ వచ్చిందా, చనిపోయారా వంటి అంశాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పోటాషియం ఉన్న ఫుడ్స్‌ తింటే సో్ట్రక్‌ రిస్కు నాల్గవవంతు తగ్గుతుందంటున్నారు. ఈ స్టడీలో పాల్గొన్నవారు రోజుకు 2.622 మిల్లీగ్రాముల పొటాషియం తీసుకుంటున్నట్టు వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమండేషన్స్‌ ప్రకారమైతే మహిళలు రోజుకు 3,510 మిల్లీగ్రాములు పొటాషియం ఉన్న ఆహారపదార్థాలు తినాలి. స్టడీలో పాల్గొన్నవారిలో 16.6 శాతం మంది అదే మోతాదులో లేదా అంతకంటే కొద్దిగా ఎక్కువగా పొటాషియం తీసుకుంటున్నట్టు తేలింది. ఈ స్టడీ ప్రధానంగా ఆహారపదార్థాల్లో ఉండే పొటాషియం పైనే జరిగింది. తక్కువ పొటాషియం తీసుకునే వారిలో కన్నా ఎక్కువ పొటాషియం తీసుకుంటున్న మహిళల్లో 12 శాతం సో్ట్రక్‌ రిస్కు తక్కువ ఉందిట. అలాగే వివిధ రకాల సో్ట్రక్స్‌ వచ్చే అవకాశం 21 శాతం తక్కువగా ఉంది. హైపర్‌టెన్షన్‌ ఉన్న మహిళల్లో పోటాషియం ఎక్కువ తీసుకున్నా సో్ట్రక్‌ రిస్కు మటుకు ఉంటుందట. అందుకేహైపర్‌టెన్షన్‌ పాలపడకముందే పొటాషియం ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకుంటే చాలా ప్రయోజనాలుంటాయట. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన సిల్వియా వాసెర్‌థైల్‌-స్మోలెర్‌ మాట్లాడుతూ సీ్త్రలు పొటాషియం ఎక్కువ ఉండే ఆహారపదర్థాలు తప్పనిసరిగా తినాలన్నారు. అదే సమయంలో ఎక్కువ పొటాషియం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిపారు. అలాచేస్తే గుండెకు హానికరమని హెచ్చరిస్తున్నారు. పోషకవిలువలున్న ఆహారాన్ని వీరు బాగా తినాలని సూచిస్తున్నారు.