Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 16:35PM

హెచ్‌వోడీల తరలింపుపై త్రిసభ్య కమిటీని వేసిన ఏపీ సర్కార్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 13 : ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వీలైనంత త్వరగా హెచ్‌వోడీల ఆఫీసులను ఏపీకి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో హెచ్‌వోడీల తరలింపుపై మూడు శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్‌ సెక్రటరీలతో ఏపీ ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ప్రాధాన్యత క్రమంలో తరలించాల్సిన కీలకమైన కార్యాలయాలను గుర్తించి వాటిని ఎక్కడి తరలించాలి... అక్కడున్న వసతులేంటి?, ఎప్పటిలోగా తరలించాలన్న అంశాలపై అధ్యయనం పూర్తి చేసి 15 రోజుల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కమిటీ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.