desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 09:14AM

మెదక్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

మెదక్‌, సెప్టెంబర్‌ 13 : మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మెదక్‌ లోక్‌సభ పరిధిలో 15,43,422 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మెదక్‌ లోక్‌సభ బరిలో కొత్త ప్రభాకర్‌రెడ్డి(టీఆర్‌ఎస్‌), సునీతాలక్ష్మారెడ్డి(కాంగ్రెస్‌), జగ్గారెడ్డి(టీడీపీ, బీజేపీ కూటమి), 9 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 14 మంది పోటీలో ఉన్నారు. పటాన్‌చెరు, సంగారెడ్డి, దుబ్బాక, గజ్వేల్‌, నర్సాపూర్‌, మెదక్‌, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ జరుగుతోంది. కేసీఆర్‌ ఎంపీ సీటుకు రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ్చ్ఠష్పజ్ఛు