Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:51AM

11 వేలకే గ్రూప్స్‌ శిక్షణ


ఆర్టీసీ కార్మికుల పిల్లలకు వెసులుబాటు

గ్రూప్‌-1, గ్రూప్‌-2 పరీక్షలకు సిద్ధమవుతోన్న తమ ఉద్యోగులు, కార్మికుల పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌ స్టడీ సర్కిల్‌తో కలిసి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. రూ.11 వేలు మాత్రమే ఈ శిక్షణకు ఫీజుగా వసూలు చేయనున్నట్లు సంస్థ సీనియర్‌ పౌర సంబంధాల అధికారి కిరణ్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉద్యోగులు, సిబ్బంది సంక్షేమార్ధం తీసుకుంటున్న పలు చర్యల్లో భాగంగానే వారి పిల్లల విద్యాభివృద్ధికి కూడా సహకరించాలన్న ఉద్దేశంతోనే ఆర్టీసీ ఈ మేరకు ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ కళాభవన్‌లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం 094907 55375 నంబర్‌లో సంప్రదించాలని కిరణ్‌రెడ్డి తెలిపారు.