Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:51AM

రంగు మారిన కేసీఆర్‌ కాన్వాయ్‌


నలుపు నుంచి తెలుపులోకి వాహనాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజోతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వాహన శ్రేణి(కాన్వాయ్‌)లోని వాహనాలు తెలుపురంగు సంతరించుకున్నాయి. కాన్వాయ్‌లో మొత్తం ఆరు నలుపురంగు ఫార్చునర్‌ కార్లతోపాటు ఒక అంబులెన్స్‌ ఉండేది. కాన్వాయ్‌లోని వాహనాలను తెలుపు రంగులోకి మార్చాల్సిందిగా సీఎం కేసీఆర్‌ కొద్దిరోజుల క్రితమే ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మొదటి దశలో మూడు వాహనాల్ని తెలుపు రంగులోకి మార్చారు. రంగుమారిన వాహనాలతో మొదటగా శుక్రవారం క్యాంపు కార్యాలయం నుంచి గవర్నర్‌ వద్దకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ ఆ తర్వాత సచివాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి కాన్వాయ్‌లోని మూడు వాహనాల్ని తెలుపు రంగులోకి మార్చిన అధికారులు మిగిలిన వాటికీత్వరలోనే రంగు మార్చనున్నారు. ఇటీవలే కేసీఆర్‌ కాన్వాయ్‌లో చేరిన అత్యాధునిక జామర్‌ వాహనానికి కూడా తెలుపు రంగు వేయనున్నారు.