Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:33AM

నేడే ఉప పోలింగ్‌


3 ఎంపీ, 33 ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు
16న ఫలితాలు..మోదీకి అగ్ని పరీక్ష

న్యూఢిల్లీ: మోదీ మ్యాజిక్‌ పనిచేసేనా?సాధారణ ఎన్నికల ఫలితాలే ఉప ఎన్నికల్లోనూ పునరావృతమయ్యేనా? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలంటే నాలుగు రోజులు వేచి చూడాల్సిందే! భారీ మెజారిటీతో అఽధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి మోదీకి ఉప ఎన్నికల రూపంలో తొలిసవాలు ఎదురవుతోంది. దేశ వ్యాప్తంగా మూడు పార్లమెంట్‌ స్థానాలకు, 33 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేసిన గుజరాత్‌లోని వడోదరతోపాటు ములాయం సింగ్‌ యాదవ్‌ రాజీనామా చేసిన మెయిన్‌పురి, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖరరావు రాజీనామా చేసిన మెదక్‌ పార్లమెంట్‌ స్థానాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి.