Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:21AM

ప్రసారాల పునరుద్ధరణకు సహకరించండి

చంద్రబాబుకు జర్నలిస్టుల వినతి..
మద్దతుంటుందని బాబు భరోసా
తిరుపతి,సెప్టెంబర్‌ 12: తెలంగాణలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి , టీవీ9 చానెళ్ల ప్రసారాల పునరుద్ధరణకు సహకరించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు పాత్రికేయ ప్రముఖులు వినతి పత్రం సమర్పించారు. తిరుపతిలో శుక్రవారం జరిగిన కేంద్ర ఆర్థిక సంఘం సమావేశానికి హజరైన చంద్రబాబును ఐజేయూ ప్రధాన కార్యదర్శి అమర్‌, మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్‌,ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు అమరనాథ్‌, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు సోమసుందర్‌, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు తదితరులు కలిశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తమ హక్కుల కోసం జర్నలిస్టు సంఘాలు మరింత గట్టిగా పోరాడాలన్నారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు మీడియాకు ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.