desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 03:18AM

ఏబీఎన్‌పై ఉద్దేశపూర్వక కుట్ర: జీవన్‌రెడ్డి


కరీంనగర్‌, సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎలాంటా వ్యతిరేక కథనాలను ప్రసారం చేయకపోయినా ఉద్దేశపూర్వకంగానే ఆ చానల్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, సీఎల్‌పీ ఉపనేత టి. జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో పత్రికాస్వేచ్ఛను కాలరాసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే నిషేధం విధిస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో మీడియా ఎంతటి కీలక పాత్ర పోషించిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ,ఆనల్‌ ప్రసారాలను నిలిపి వేయడం సరైంది కాదని దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.