Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:18AM

ఎల్‌ఈసీ కార్డుల లక్ష్యసాధనలో వెనుకబడితే అఽధికారులకు బదిలీ తప్పదు

కలెక్టరేట్‌ (కలెక్టర్‌): జిల్లాలో రుణ అర్హత కార్డులు అందించిన కౌలు రైతులందరికీ నెలాఖరులోపు రుణాలందించే లక్ష్యాలు సాధించాలని వాటిని సాధించలేని వ్యవసాయశాఖ అధికారులకు బదిలీ వేటు తప్పదని జాయింట్‌ కలెక్టర్‌ ముత్యాలరాజు హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రుణ అర్హత కార్డులపై కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందిస్తున్న అంశంపై వ్యవసాయ శాఖాధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. ఎల్‌ఈసీ కార్డులు లక్ష్యసాధన తద్వారా రైతులకు రుణాలు మంజూరు చేయడంలో జిల్లాలో చాలా మండలాలు వెనుకబడి ఉన్నాయన్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ నెలాఖరులోగా ఎల్‌ఈసీ కార్డుదారులకు బ్యాంకు రుణాలు అందించే లక్ష్యాన్ని అందుకునేందుకు వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే అక్టోబర్‌లో జరిగే బదిలీల్లో వేటు తప్పదని హెచ్చరించారు. ఈ నెల 15లోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు మాత్రమే పంట బీమా సౌకర్యం వర్తిస్తుందన్నారు. రుణాలందించే లక్ష్యాన్ని నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. దీనిపై రోజూ అధికారులు ప్రగతి నివేదిక సమర్పించాలని, దాన్ని సాధించేందుకు మండల స్థాయి అధికారుల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి లక్ష్య సాధనకు వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్‌ కృషి చేయాలని ఆదేశించారు. కరప, పి.గన్నవరం, కాజులూరు మండలాలు కోటి రూపాయలు పైన రుణం మంజూరు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. జేడీ విజయకుమార్‌ మాట్లాడుతూ రానున్న రెండు వారాల్లో పొలం పిలుస్తోంది, ఎలుకల నిర్మూలనలో రైతులకు రుణాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. రైతు రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించిన రైతుల వివరాలను ఈ నెల 15వ తేదీలోగా హైదరాబాద్‌కు సమర్పించాలని ఎల్‌డీఎం జగన్నాధస్వామి కోరారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖర్‌రాజు, నాబార్డ్‌ ఎల్‌జీఎం డాక్టర్‌ కేవీఎస్‌ ప్రసాద్‌, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.