Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:17AM

200 ఎకరాల్లో రాయలసీమ ప్రభుత్వ ఆసుపత్రి

కర్నూలు(ఎన్టీఆర్‌సర్కిల్‌): కర్నూలులో 200 ఎకరాల విస్తీర్ణంతో రాయలసీమ ప్రభుత్వాసుపత్రి ఏర్పాటు చేయనున్నామని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. శుక్రవారం కర్నూలు వైద్య కళాశాల న్యూ ఆడిటోరియంలో 37వ ఏపీ చాప్టర్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా (అసాసికాన్‌) 2014 రాష్ట్ర సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కేఈ మాట్లాడుతూ కర్నూలు వైద్య కళాశాల తొలుత ప్రభుత్వాసుపత్రితో మొదలై ఈ స్థాయికి చేరిందని, అందుకు తన హితోధిక సహయం అందిచానన్నారు. 1956లో ప్రారంభమైనా కర్నూలు వైద్య కళాశాల అప్పట్లో 50 సీట్లతో ఉండేదని, ప్రస్తుతం 200 సీట్లకు పెరిగిందన్నారు. అనంతరం డైరక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ శాంతారావు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం కర్నూలు బోధనాసుపత్రిలో సూపర్‌ స్పెషాలిటీ కోర్సులు ప్రారంభమవుతాయని చెప్పారు. అనంతరం ఉపముఖ్యమంత్రితో కలసి సాపనీర్‌ ఆవిష్కరించారు. కర్నూలులో సీనియర్‌ వైద్యులను ఘనంగా సన్మానించారు. సదస్సులో ఎజేఐ కార్యదర్శి పీఎస్‌కె మిశ్రా, ఎఎస్‌ఐ చైర్మన్‌ డాక్టర్‌ పీవీ రమమూర్తి, డాక్టర్‌ కృష్ణమూర్తి కలెక్టర్‌ విజయమోహన్‌, జెడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌, కర్నూలు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాం ప్రసాదు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉమామహేశ్వర్‌, అసాసికాన్‌ కమిటీ డాక్టర్‌ కృష్ణనాయక్‌, కార్యదర్శులు డాక్టర్‌ రామచంద్రనాయుడు, డాక్టర్‌ ఎస్వీ రాంమోహన్‌రెడ్డి, కార్యదర్శి డాక్టర్‌ శ్రీహరి పాల్గొన్నారు.