desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:17AM

పద్మశ్రీ అవార్డు కోసం డాక్టర్‌ నాగేశ్వరమ్మ దరఖాస్తు


గుంటూరు (మెడికల్‌): గుం టూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రి లైం గిక, చర్మవ్యాధుల వైద్య విబాగాధిపతి డాక్టర్‌ టీ నాగేశ్వరమ్మ ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు కోసం తన పేరును పరిశీలించాలని ప్రభుత్వానికి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా జిల్లా ఎయిడ్స్‌ రంగంలో తాను అందించిన వైద్యసేవలను పరిగణలోకి తీసుకొని పద్మశ్రీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వానికి వైద్యుల కోటాలో తన పేరును రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గుంటూరు మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ద్వారా దరఖాస్తు చేసేందుకు సమయం ముగియడంతో డాక్టర్‌ నాగేశ్వరమ్మ వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా పద్మా అవార్డులకు దరఖాస్తులు దాఖలు చేసేందుకుసోమవారం వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎయిడ్స్‌ వైద్య రంగంలో డాక్టర్‌ కూటికుప్పల సూర్యారావు మాత్రమే పద్మశ్రీ అవార్డును సాధించారు. గుంటూరు వైద్య కళాశాల నుంచి గతంలో సుప్రసిద్ధ శిశు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్‌ యార్లగడ్డ నాయుడమ్మ పేరు మాత్రమే పద్మశ్రీ అవార్దు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. డీవీఎల్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నాగేశ్వరమ్మ గుంటూరు వైద్య కళాశాల పరిధిలో పని చేస్తున్నా ఆమె మాత్రం వ్యక్తిగతంగా పద్మశ్రీ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. ్లలో భశ్రీలజిరర