Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:16AM

‘అబద్దబంధు..!’


అనంతపురం, కలెక్టరేట్‌: ఆపద్బంధు పథకం అబద్దమవుతోంది. బాధిత కుటుంబాలను ఆదుకోలేకపోతోంది. ప్రమాదాల్లో కుటుం బ పెద్దను కోల్పోయిన కుటుంబాలకు ప్రభు త్వం ఆపద్బంధు పేరుతో ఆర్థిక సాయం చే స్తోంది. కుటుంబ పెద్ద దిక్కును పోగొట్టుకున్న కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సా యం కాస్తో.. కూస్తో ఉపయోగపడుతోంది. ఏ డాదిగా ఆపద్బంధు అటకెక్కింది. గతేడాది న వంబర్‌ నుంచి ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఆపద్బంధు పథకం కింద ఆర్థికసాయం కో సం 82 మందికిపైగా బాధిత కుటుంబాలు అ ర్జీలు పెట్టుకున్నాయి. తహసీల్దార్‌ కార్యాల యం నుంచి ఈ పథకం కింద ఆర్థిక సాయం చేయాలని సిఫార్సులు కలెక్టరేట్‌కు అందాయి. ఇప్పటివరకు ఏ ఒక్కరికీ ఆర్థిక సాయం చేయ కపోవడం గమనార్హం. నిబంధనల మేరకు రో డ్డు ప్రమాదాలు, నీటిలో పడి, చెట్టు నుంచి ప డి మరణించిన వారికి, విద్యుత్‌ ప్రమాదాలు, పాము కాటుతో చనిపోయిన వారికి ఆపద్బం ధు వర్తిస్తుంది. బాధిత కుటుంబాలకు ప్రభు త్వం తరపున ఆర్థికసాయం కింద రూ.50వేలు అందజేస్తారు. గతేడాది వరకూ ఈ పథకం సవ్యంగా సాగింది. అప్పటి పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఆపద్బంధు పథకం ఆర్ధాంతరంగా ఆగిపోయింది. సార్వత్రిక ఎన్నికలు ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనా... ఆప ద్బంధు ముందుకు కదలకపోవడం విమర్శల కు తావిస్తోంది.
బుట్టదాఖలైన దరఖాస్తులు...
ప్రమాదాల్లో కుటుంబ పెద్ద దిక్కును కో ల్పోయి ఆర్థికసాయం కోసం బాధితులు చేసుకున్న దరఖాస్తులు బుట్టదాఖలవుతున్నాయి. జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తులు ఇక్కడే పేరుకుపోయాయి. నిబంధనల మేరకు నిర్దేశించిన తేదీల్లోగా దరఖాస్తులు చేసుకున్న వారికి ఆ ఏడాదిలోపుగానే తక్షణ ఆర్థికసాయం అందజేయాల్సి ఉంది. ఏ డాదికి ముందు నుంచి దరఖాస్తు చేసుకున్న వారికే దిక్కులేకుండాపోయింది. తాజాగా ప దుల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. పాత వాటికే ఆర్థిక సాయం చేయకపోవడంతో కొత్త వాటిని సంబంధిత మండల అధికారులు తిరస్కరిస్తున్నారు. ఆర్థిక సాయం కోసం మండల కార్యాలయాలు, కలెక్టరేట్‌చు ట్టూ ప్రదక్షణిలు చేయడం బాధిత వర్గాల వం తైంది. కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజ నం లేకపోవడంతో ఆర్థిక సాయంపై ఆశలు వదులుకుంటున్నారు.
నిధుల మంజూరులో నిర్లక్ష్యం..
ఆపద్బంధు పథకం కింద దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నా రన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా నిధుల లే మి కారణంతోనే ఈ పథకం కుంటుపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు 10 మందికి మాత్రమే ఆర్థిక సాయం చేసేందుకు నిధులు ఉన్నట్లు కలెక్టరేట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏ ఒక్కరికీ ఆర్థికసాయం చేయపోవడం గమనార్హం. జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించిన దాఖలాల్లేవనే చెప్పాలి. ఆపద్బంధు పథకం పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు తెప్పించడంలో అటు పాలకులు,ఇటు జిల్లా ఉన్నతాధికారులు చొరవ చూపడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అఽధికారులు స్పందించి బాధిత కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉంది. మరి ఏ మేరకు వారు చొరవ చూపుతారో వేచిచూడాల్సిందే.