desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:16AM

స్కానింగ్‌ కేంద్రాలపై ఇక ఆకస్మీక తనిఖీలు


గుంటూరు (మెడికల్‌): జిల్లాలో స్కానింగ్‌ కేంద్రాలు, జెనెటిక్‌ కౌన్సెలింగ్‌ కేంద్రాలు, ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరు పరిశీలించేందుకు ఇకపై తాను ఆకస్మీక తనిఖీలు చేపడతానని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ కే సుధాకర్‌బాబు వెల్లడించారు. జిల్లావైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహాకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఆర్‌ నాగమల్లేశ్వరీ అధ్యక్షతవహించారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అతిక్రమించే స్కానింగ్‌ కేంద్రాలను గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక విజిలెన్స్‌ విభాగాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని డాక్టర్‌ సుధాకర్‌ బాబు తెలిపారు. డెకాయ్‌ కస్టమర్లను పంపి సీక్రెట్‌ కెమెరాతో స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించినా సరైన ఫలితాలు రాబట్టలేకపోయినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీలు చేయాలని డీఎంహెచ్‌వోను ఆయన ఆదేశించారు. నవ్యాంధ్రలో ఇప్పటి వరకు పీసీ పీఎన్‌డీటీ చట్టం ఉల్లంఘించిన 16 స్కానింగ్‌ కేంద్రాలపై కేసులు నమోదు చేశామని, జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు ఆయన వివరించారు. పుట్టేది ఆడో, మగో ముందుగానే చెప్పడంతో బాలుర, బాలిక నిష్పత్తిలో అంతరం పెరుగుతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో వెయ్యి మంది బాలుర సంఖ్యకు 948 మంది బాలికలు మాత్రమే ఉన్నట్లు ఆయన వివరించారు.
హైరిస్క్‌ మండలాలపై ప్రత్యేక దృష్టి...
కారంపూడి, నిజాంపట్నం, మేడికొండూరు, దాచేపల్లి మండలాల్లో వెయ్యి మంది బాలురకు సగటున 887 మంది బాలికలే ఉన్నట్లు ఆయన వివరించారు. వీటిని హైరిస్క్‌ మండలాలుగా గుర్తించి ఇక్కడ ఆడ పిల్లల సంరక్షణ పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. దీనికి ప్రత్యేక బడ్జెట్‌ కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి కీ సమాజంలో ఆడ పిల్లల పట్ల వివక్ష తగ్గలేదని, వరకట్న దురాచారం, వంశాకురం కావాలనే ఆలోచనలే ఇందుకు కారణమని ఆరోగ్య శాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ బాబు వివరించారు.
అబార్షన్‌ చేసే ఆస్పత్రులూ నమోదు చేసుకోవాలి
జిల్లాలో గర్భస్రావ వైద్యసేవలు అందించే ఆస్పత్రులు, నర్సింగ్‌ హోమ్‌లు తప్పనిసరిగా జిల్లా వైద ్య ఆరోగ్య శాఖలో తమ కేంద్రాల పేర్లు రిజిసే్ట్రషన్‌ చేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ నాగమల్లేశ్వరీ తెలిపారు. ఈ నెలాఖరు వరకే దీనికి గడువని, ఈలోపు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. గుంటూరు నగరంలో స్కానింగ్‌ కేంద్రాలను ఆన్‌లైన్‌తో అనుసంధానం చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఇకపై ఆయా స్కానింగ్‌ కేంద్రాల వైద్యులు గర్భిణీల వివరాలను ఏ రోజుకు ఆ రోజు ఆన్‌లైన్‌లో తమకు పంపాలని ఆమె సూచించారు. స్కానింగ్‌ సెంటర్ల వైద్యులు ఫారం-ఎఫ్‌తో పాటు ఇతర రికార్డులు సరిగా నిర్వహించాలని, తనిఖీల సమయంలో ఇవి సరిగా లేనట్లు గుర్తిస్తే చర్యలు తప్పవని డాక్టర్‌ నాగమల్లేశ్వరీ హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పీ ఉమాదేవి, డీఐవో డాక్టర్‌ ఎం సుహాసిని, డీపీఎంవో డాక్టర్‌ ఎం శ్యామలాదేవి, జబార్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ బీ లక్ష్మానాయక్‌, డిప్యూటీ డెమోలు జీ రామచంద్రుడు, ఏలియా పాల్గొన్నారు.
ఎస్పీహెచ్‌వోల సమావేశం...
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు డాక్టర్‌ సుధాకర్‌ బాబు శుక్రవారం సాయంత్రం డీఎంహెచ్‌వో ఛాంబర్‌లో ఎస్పీహెచ్‌వోలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బాలుర, బాలిక నిష్పత్తి మధ్య తేడా ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి భ్రూణ హత్యల నివారణపై ప్రచారం చేయాలని ఆదేశించారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీసీ పీఎన్‌డీటీ విభాౄగంలో పని చేసే హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వాణీశ్రీపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపారు. స్కానింగ్‌ కేంద్రాల నుంచి ఆమె డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందటంతో ఆయన ఈ విచారణ జరిపారు. చివరగా జిల్లాలో కొన్ని స్కానింగ్‌ కేంద్రాలను ఆకస్మికంగా ఆయన తనిఖీలు చేశారు. ే3