Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:16AM

నెల రోజుల్లో సహకార బ్యాంకు విభజన


మంగళగిరి: రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను రెండుగా విభజిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సహకార బ్యాంకును మరో నెల రోజుల్లో విభజించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ ముమ్మనేని వెంకట సుబ్బయ్య తెలిపారు. మంగళగిరి సహకార బ్యాంకు కార్యాలయానికి విచ్చేసిన ఆయన కొద్దిసేపు విలేఖర్లతో మాట్లాడారు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం సీమాంధ్రకు 58 శాతం, తెలంగాణకు 42 శాతం నిష్పత్తిలో ఆస్తులు, అప్పులు, పంపకాలు జరగాల్సి ఉందన్నారు. విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతంలో అత్యాధునిక హంగులతో రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రుణమాఫీకి సంబంధించి గతేడాది డిసెంబర్‌ 31 వరకు తీసుకున్న వ్యవసాయ, బంగారు నగలు, చేనేత, డ్వాక్రా రుణాల మాఫీ జరగాల్సి ఉందన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రీషెడ్యూల్‌ చేసిన రుణాలను కూడా మాఫీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఉద్యోగులందరి సహకారంతో రుణమాఫీ సాధ్యపడిందన్నారు. సహకార సంఘాలలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. మంగళగిరిలో రూ.50 లక్షలు, దుగ్గిరాలలో రూ.50 లక్షలు, నరసరావుపేటలో మరో రూ.20 లక్షలు, తాడేపల్లిలో రూ.కోటి మూడు లక్షలను గోల్‌మాల్‌ చేశారన్నారు.
స్వాహా అయిన సొమ్మును చాలావరకు రికవరీ చేశామని తెలిపారు. తాడేపల్లి పీడబ్ల్యూడీ వర్క్‌షాపు ఎంప్లాయిస్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో గోల్‌మాల్‌ అయిన నిధులను నయాపైసలతో సహా వసూలు చేస్తామని తెలిపారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తిలేదని చెప్పారు. స్వాహా సొమ్ములు రాబట్టేందుకు బ్యాంకు యంత్రాంగం, పోలీసు శాఖ శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయన్నారు. రైతుల సంక్షేమానికి సహకారం సంఘం పెద్దపీట వేస్తుందన్నారు. సమావేశంలో బ్యాంకు జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, మంగళగిరి శాఖ మేనేజరు యూవీ రాధాకృష్ణ, మంగళగిరి, నూతక్కి పీఏసీఎస్‌ అధ్యక్షులు గాదె పిచ్చిరెడ్డి, బేతపూడి చంద్రశేఖర్‌, బ్యాంకు డైరెక్టర్లు జంజనం కృష్ణమూర్తి, తోట పార్థసారఽథి పాల్గొన్నారు.ఛీతీ:÷ఎలఖ÷్ఞో