Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:16AM

పెళ్లే మలుపు..

చక్కటి చీరకట్టు.. నుదుటిపై నామపుబొ ట్టు.. మోములో హాసం.. అచ్చమైన తెలుగు ఇ ల్లాలంటే ఇలా ఉండాలనే నిండైన రూపం.. కలబోస్తే అనంత నగర మేయర్‌ స్వరూప.. అ లాంటి ఇల్లాలు అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు.. అనూహ్య పదవులెన్నో చేపట్టారు.. అనంత ఆది మహిళా మేయర్‌గా రికార్డుకెక్కా రు. ఈ బాధ్యతలు చేపట్టాల్సి వస్తుందని కల లో కూడా అనుకోలేదని చెబుతున్నారామె. ఉ న్నత చదువులు లక్ష్యంగా పెట్టుకుని.. పెళ్లి వ ద్ద మలుపు తిరిగినట్లు చెబుతున్న ఆమె విజయప్రస్థానం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే..
శింగనమల మండలం పెరవలి మా గ్రా మం. అమ్మ రామలక్ష్మి, నాన్న వెంకటనాయు డు. మాది వ్యవసాయ కుటుంబం. ఒకటో త రగతి నుంచి ఐదు వరకూ పెరవలిలోనే చదువుకున్నా. చదువులో గర్వించే స్థాయికి ఎదగాలనుకునేదాన్ని. ఉన్నత చదువే జీవిత లక్ష్యం గా భావించేదాన్ని. కష్టం విలువేమిటో నాకు తెలుసు. కన్నీళ్ల కథలూ అర్థం చేసుకోగలను. అందుకే ఊహ తెలిసినప్పటి నుంచే పేదలకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని నిర్ణయించుకున్నా. ఆరు నుంచి పది దాకా అనం తపురం కేఎస్‌ఆర్‌ హైస్కూల్లో, ఇంటర్‌ కూడా కేఎస్‌ఆర్‌ బాలికల కళాశాలలోనే పూర్తి చేశా. బీఏ, పీవీకేకే డిగ్రీ కలాశాలలో చదివా. 1997 లో ప్రేమ వివాహం చేసుకున్నా. రెండు కు టుంబాల పెద్దలూ మా ప్రేమను అర్థం చేసుకుని, ఆశీర్వదించారు. సామాజిక స్పృహ, రాజకీయాలపై ఆసక్తి నా భర్త వెంకటేష్‌ వల్లే నా కు కలిగాయి. మహిళలను ఇల్లు దాటి వె ళ్లనివ్వరేమోనని భయపడ్డాను. నా ఆశయాలను అర్థం చేసుకున్న నా భర్త నన్ను సామాజిక సేవ, రాజకీయ రంగాల్లో చాలా ప్రోత్సహించారు. ప్రస్తుతం నేను ఈ స్థాయికొచ్చానంటే ఈ క్రెడిట్‌ అంతా నా భర్తదే.
కుటుంబం.. రాజకీయం..
నా భర్త, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం నన్ను ముందుకు నడిపిస్తోంది. కుటుంబం పరంగా నాకు ఎంత బాధ్యత ఉందో.. మేయర్‌గా అవకాశం ఇచ్చిన నగర ప్రజల సంక్షేమంపై కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంది. 2004లో చంద్రబాబు పిలుపునందుకుని రాజకీయరంగంపై ఆసక్తి కలిగింది. అ నూహ్యంగా 2005 మున్సిపల్‌ ఎన్నికల్లో 20వ డివిజన్‌ కార్పొరేట్‌గా టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందాను. తెలుగు మహిళ రాష్ట్ర ప్ర చార కార్యదర్శిగా మూడేళ్లు పనిచేశా. ప్రస్తు తం జిల్లా అధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మొట్టమొదటి కార్పొరేటర్‌గా గెలవడం వెనుక కాల్వ శ్రీనివాసులు సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఉన్నాయి. నా భర్త వెంకటేష్‌ ప్రతి విషయంలోనూ నాకు గొప్ప గైడ్‌. నాకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి నాగప్రమోద్‌ ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నాడు. రెండో అబ్బాయి సాయిశ్రీనివాస్‌ ఆరో తరగతి చదువుతున్నాడు. కుటుంబ, రాజకీయ బాధ్యతలనూ సమన్వయం చేసుకుంటున్నా.
క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ సిటీగా మారుస్తా..
అనంతపురం చాలా చరిత్రాత్మకమైన నగ రం. అన్ని రకాల సంప్రదాయాలు, జీవన రీ తులు, అపారమైన చైతన్యం కలబోసుకున్న నగరమిది. అనంతకు మొదటి మహిళా మే యర్‌ను అవుతానని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం నాపై ఎంతో బాధ్యత ఉంది. వీధిలైట్లు, రహదారులు, డ్రైనేజీల నిర్మాణం, పైప్‌లైన్ల ఏర్పాటు తదితర మౌలిక వసతుల కల్పనకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నా. అంద రి సహకారంతో సృష్టమైన ప్రణాళికతో సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమిస్తున్నా. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను గుర్తించి పరిష్కారం చూపడంలో చాలా ఆత్మ సంతృప్తి లభిస్తోంది. పరిశుభ్రమైన హరితవనంగా అనంతపురాన్ని మార్చడమే ధ్యే యంగా పనిచేస్తున్నా. 50డివిజన్ల మురుగు కాల్వల్లో పూడిక తీయించేందుకు కృషి చేస్తా. సాధారణ మహిళనైన నన్ను పార్టీ పరం గా ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ధన్యవాదాలు. వంద రోజుల అభివృద్ధి కార్యక్రమంలో అందరూ నాకు అండగా నిలస్తున్నా రు. కష్టించే మనస్తత్వం ఉన్న మహిళలకు తె లుగుదేశం పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తోంది. పదవీకాలం ముగిసేలోగా ప్రజా సమస్యలన్నింటినీ అందరి సహాకారంతో పరిష్కరించేందుకు నిరంతం కష్టపడతాను.
(అనంతపురం ఫీచర్స్‌)