Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 02:15AM

ప్రతి నీటి బొట్టూ విలువైనదే..

బుక్క రాయ సముద్రం:
‘ప్రతి నీటి చుక్క ఎంతో విలువైనది. ప్రతి నీటి చుక్కను ఉపయోగించుకుని అధిక లాభాల పంటలు సాగు చేయాలి’ అని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ ఏ పద్మరాజు రైతులకు సూచించారు. స్థానిక రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానంలో రైతులతో ఆయన శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పద్మరాజు మాట్లాడుతూ.. వర్షపు నీటిని నిల్వ చేసుకుని, ఆ నీటిని తిరిగి పంటలకు ఏవిధంగా ఉపయోగించుకోవాలో అవగాహన చేసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రాంతంలో వరి, వేరశనగ పంటలు తక్కువ సాగు చేయాలన్నారు. గోరు చిక్కుడు పంట సాగు చేసుకుంటే అనువగా ఉంటుందన్నారు. మార్కెటింగ్‌ సదుపాయం కూడా ఉంటే లాభాలు ఉంటాయన్నారు. ప్రభుత్వం కూడా జిల్లాలో రూ.2కోట్ల వ్యయంతో గోరు చిక్కుడు ప్రాసెసింగ్‌ యూనిట్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో మాదిరిగా జిల్లాలో కూడా తక్కువ నీటితో పండ్ల తోటలు సాగు చేస్తే లాభ సాటిగా ఉంటుందన్నారు. పాడి, కోళ్లు, ఇతర పరిశ్రమలు పెట్టుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మెట్టు భూముల వ్యవసాయంపై పరిశోధనలు చేయడానికి 25 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లాలో తొలి రైతుల అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పరిశోధనలకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తే మరిన్ని ఫలితాలు సాదించే దిశగా పరిశోధనలు చేస్తామన్నారు.