Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:56AM

అగ్నిప్రమాదంలో రూ.10 లక్షల ఆస్తి నష్టం

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లో గురువా రం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి గురైన ఇంటిలోని గ్యాస్‌ సిలిండర్లు ఒకదాని తరువాత ఒకటి పేలడంతో ఇంటికి మంటలు అంటుకొని 2 లక్షల నగదు, 5 తులాల బంగారం, అరకిలో వెండి ఆభరణాలు కాలిపోయాయి. కిసాన్‌నగర్‌కు చెందిన గాదె హరికృష్ణకు చెందిన ఇంటిలో కట్ట రాజు, జయ దంపతులు 10 సంవత్సరాలుగా నివాసం ఉం టున్నారు. ఈ నివాసంలోనే అగ్ని ప్రమాదం జరిగి ఇల్లు పూర్తిగా కాలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేక పోవటంతో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. కట్ట రాజు వేములవాడలోని ఒక వసతి గృహంలో వంటమనిషిగా ఉద్యో గం చేస్తున్నాడు. కట్టరాజు, అతని కొడుకులు ఊరుకు వెళ్లడంతో కట్ట జయ ఒకరే ఉండ టంతో ఆమె గురువారం రాత్రి భోజనం చేసి న తరువాత సమీపంలో ఉన్న ఆమె బంధువుల ఇంటిలో పడుకుంది. రాత్రి 12.45 గంటలకు వారు నివాసం ఉంటున్న ఇంటిలో పేలి న శబ్ధం రాగా స్థానికులు ఇళ్ళ నుంచి బయటకు వచ్చే సరికి ఇంటిలో పెద్దగా మంటలు కనిపించాయి. 10 నిమిషాలలో మరో పేలిన శబ్ధం వినిపించింది. దీంతో మంటలు ఎక్కువై ఇంటి పరిసరాలకు కూడా వెళ్ళలేని విధంగా మంటలు వ్యాపించాయి. అయితే ఇంటిలో రెండు నిండు గ్యాస్‌ సిలిండర్లు, ఒక ఖాళీ గ్యాస్‌ సిలిండర్లు ఉన్నట్లు యజమాని జయ తెలిపారు. గ్యాస్‌ లీకేజీ లేదా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉం టుందని భావిస్తున్నారు. సంఘటన జరిగిన వెంటనే అదే ప్రాంతంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అక్కడికి చేరుకుని వెంటనే ఫైరింజన్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని రెండు గంటలపాటు కష్టపడి మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుం డా అదుపులోకి తీసుకువచ్చారు. అయితే పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిరి పక్కనే ఉన్న ఇళ్లపై పడటంతో కిటికీ అద్దాలు ధ్వంస మై కోటగిరి అనిల్‌, కాసనగొట్టు కాశీ, దీకొండ శరత్‌లకు గాయాలయ్యాయి. కరీంనగర్‌ మూ డవ ఠాణా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.