Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:56AM

వ్యర్ధజలాలతో అవస్థలు


రణస్థలం : బీరు పరిశ్రమ వ్యర్థాలతో సమీపంలోని ఎర్రచెరువు కలుషితమై విలువైన మత్స్యసంపద మృత్యువాత పడుతోందని కంబాలపేట గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రైతులు చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన పి.సత్యనారాయణ అనే రైతు పంచాయతీకి రూ.50 వేలు చెల్లించి చెరువులో చేపలు పెంచుతున్నాడు. కళ్ల ముందే చేపలు మృత్యవాత పడుతుండడంతో కన్నీరుమున్నీరవుతున్నాడు. పలుమార్లు యాజమాన్య ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం చాలావరకూ చేపలు మృత్యువాతపడ్డాయని... తీవ్రంగా నష్టపోయానని.. దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పరిశ్రమ నుంచి వెలువడిన వ్యర్థజలాలను పరిశీలించాల్సిన కాలుష్యనియంత్రణ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
కలుషితమవుతున్న భూగర్భ జలాలు
ఎర్రచెరువు రంగు మారడంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ప్రజలు రోగాలబారిన పడుతున్నాడు. కంబాలపేట మల్లిఖార్జునస్వామి ఆలయానికి సంబంధించిన బావి పూర్తిగా కలుషితమయ్యింది. ఏటా వర్షాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాలుష్య నియంత్రణ సంస్థ ఏఈ లహరి మాట్లాడుతూ పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.జీల్ఢ్లర