Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:55AM

రుణమాఫీ పేరిట ప్రభుత్వ మోసం

సుభాష్‌నగర్‌: రుణమాఫీ విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కాంగ్రెస్‌ శాసనసభ పక్ష ఉపనేత టి. జీవన్‌రెడ్డి అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కలెక్టరేట్‌ ఎదుట డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం అధ్యక్షతన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీఆర్‌ ఎస్‌ ప్రణాళికకు ఆకర్షితులై ఓట్లేసిన ప్రజలకు న్యాయం జరగలేదని, కొత్త రుణాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుకు రుణమాఫీ ఎ లా వర్తిస్తుందో చూడాలన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోత, పొలాలు ఎండిపో యే పరిస్థితి రాకుండా చూశామన్నారు. ఇప్పటి వరకు 173 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఏబీ ఎన్‌ ఆంధ్రజ్యోతి ఎలాంటి వ్యతిరేక కఽథనాలను ప్రసారం చేయనప్పటికి ఆ ఛానల్‌ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే వారిపై ఇలాంటి చర్యలే తీసుకుంటామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో మీడియా ఎంతటి కీలక పాత్ర పోషించిందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. తెలంగాణ అమరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా చెల్లించ లేదన్నారు. అబద్దం అడితే తలతీసుకుంటానని కేసీఆర్‌ ఎన్నో సార్లు అన్నారని, వంద తలలైనా సరిపోవని ఏద్దేవా చేశారు.దళితుడిని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని మాట నిలబెట్టుకోకుంటే తలతీసేసుకుంటానని బహిరంగ సభలో ప్రకటించారని, అదే దళిత ఉపముఖ్యమంత్రిని సభ వేదికపై అవమానకరంగా మాట్లాడారని అన్నారు. ఎ మ్మెల్సీ సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ వ్యాఖ్యలు తుపాకిరాముడిలాగా ఉన్నాయని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రైతుల రుణమాఫీ వంటి పథకాలు వారంలో అమలు చేసి చూపించారన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కేసీఆర్‌ హామీలు మాటలకే పరిమితమని పేర్కొన్నారు. రుణమాఫీ అవుతుందని ఓటు వేస్తే వారిని దగా చేశారని అన్నారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షానపోరాడుతుందని స్పష్టం చేశారు. పీసీసీ అధికార ప్రతినిధి ప్యాట రమేశ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు రైతులను మోసం చేయలేదన్నారు. ఎబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 9 ఛానల్‌ ప్రసారాలను నిలిపి వేయడం సరైంది కాదన్నారు. మాజీ విప్‌ ఆరెపల్లి మోహన్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అబద్దాలు అడకుండా ఉండలేరని ఏద్దేవా చేశారు. కార్యక్రమంలో బొమ్మ వెంకన్న, కొమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ముదుగంటి సురేందర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్‌, ఆమ ఆనంద్‌, అంజనీప్రసాద్‌, సదానందాచారి, చెన్నాడి అజిత్‌రావు, నిఖిల్‌ చక్రవర్తి, జక్కని ఉమాపతి, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గోపాల్‌రావు, జయరామారావు, ముక్క భాస్కర్‌, సింగిరెడ్డి లక్ష్మారెడ్డి, ఎలగందుల మునీందర్‌, చేతి ధర్మయ్య, వెంకటేశ్‌, పొన్నం సత్యం, మాదాసు శ్రీను, శేఖర్‌, కట కం వెంకటరమణ, పత్తెం మోహన్‌, అంజయ్య గౌడ్‌, సురేందర్‌, హరీష్‌, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.