desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:55AM

బహుపరాక్‌

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
అనధికార వెంచర్లను ఉపేక్షించేది లేదు. మా పరిశీలనలో కానీ, ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే తక్షణం వాటిని కూలగొట్టేస్తాం. అని విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం-ఉడా) వీసీ పి.ఉషాకుమారి తెలిపారు. ఉడా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అటు వెంచర్ల నిర్వాహకులు, ఇటు కొనుగోలు చేస్తున్న ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉడా పరిధిలో 2008 నుంచి 2014 సంవత్సరం వరకు మొత్తం 476 లే అవుట్లను జారీ చేసినట్టు తెలిపారు. విజయవాడ పరిధిలో 319, గుంటూరు 124, తెనాలి 15, మంగళగిరి పరిధిలో 18 లే అవుట్లను జారీ చేశామన్నారు. ని తెలిపారు. గుంటూరు జిల్లాలో పట్టణాలు, గ్రామాలతో కలుపుకుని 153, కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూస్తే 319 లే అవుట్ల చొప్పున జారీ చేశామన్నారు. రెండు జిల్లాల్లోనూ 3,688 చదరపు మీటర్ల విస్తీర్ణంలో లే అవుట్లు మంజూరు చేయటం జరిగిందన్నారు. ఈ లే అవుట్లలో నిబంధనల ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందేనన్నారు. ఒకవేళ తాము జారీ చేసిన లే అవుట్లలో సదుపాయాలు లేని పక్షంలో ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పౌర సదుపాయాలన్నీ కల్పించిన తర్వాతనే మార్ట్‌గేజ్‌ రిలీజ్‌ చేస్తామని ఉషాకుమారి చెప్పారు. ఇదే విషయాన్ని పంచాయతీ సెక్రటరీలకు కూడా స్పష్టంగా చెప్పామన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయని లే అవుట్లను స్వాధీనం చేసుకుని వేలం వేస్తామని హెచ్చరించారు. అలా వేలం ద్వారా వచ్చిన సొమ్మును అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేస్తామన్నారు. ఉడా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు తక్కువ ధరకు వస్తున్నాయని కొనుగోళ్ళు చేయవద్దన్నారు. లే అవుట్‌ వెంచర్లకు సంబంధించి ప్రచార బ్యానర్లలో ఎల్‌పీ నెంబర్‌ తప్పనిసరిగా సూచించాలని వీసీ అన్నారు. వెంచర్లు వేసే వారు నిబంధనలను పాటించకపోయినా, ఎవరికైనా విక్రయించినా క్రిమినల్‌ కేసులను పెడతామని హెచ్చరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ పంచాయతీ రాజ్‌ కాబట్టి ఆ శాఖ ముఖ్యమైన బాధ్యత తీసుకోవాలన్నారు. ఎవరైనా వెంచర్‌కు అను మతి తీసుకుంటే సంబంధిత గ్రామపంచాయతీ, ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లోని నోటీసుబోర్డులో వివరాలను ఉండాలన్నారు.
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై నివేదిక
ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కూలిన ఘటనపై టెక్నికల్‌ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇచ్చిందని వీసీ చెప్పారు. గడ్డర్‌ కూలడంవల్లే ఇన్నర్‌ రింగు రోడ్డు నిర్మాణంలో జాప్యం ఏర్పడిందన్నారు. ఇన్నర్‌ను జాతీయ రహదారికి కలిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వీసీ తెలిపారు.
కృష్ణా విజయసాగర్‌ ప్రాజెక్టుకు ఈవోఐ పిలిచాం
కృష్ణా విజయసాగర్‌ ప్రాజెక్టుకు ఈవోఐ పిలిచాం. కొంతమంది ఆసక్తి చూపారు. వారి నుంచి ఫైనాన్షియల్‌ బిడ్‌ను స్వీకరించాల్సి ఉంది. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోవాలి. సమావేశంలో ఉడా సెక్రటరీ, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ (సీపీవో) రామచంద్రయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ) శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.