desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

15 నాటికి రుణమాఫీ వివరాలు కంప్యూటరీకరణ


(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రుణ మాఫీ ఎంత మంది రైతులకు వర్తిస్తుందన్న వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకర్లు రైతుల నుంచి ఆధార్‌, రేషన్‌కార్డులను సేకరించి కంప్యూటరీకరిస్తున్నారు. ఈనెల 15వతేదీ నాటికి కంప్యూటరీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే బ్యాంక్‌ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’ తో మాట్లాడుతూ, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కొంతమంది రైతుల దగ్గర రేషన్‌ కార్డులు లేవని చెప్పారు. వీరి విషయమై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవల్సి ఉందన్నారు. మరో వైపు ఆధార్‌ కార్డులు కూడా కొంత మంది వద్ద లేవని చెప్పారు. బ్యాంకులు ఉద్యాన పంటలకు కూడా రుణాలు ఇస్తారు. అయితే ప్రభుత్వం రుణమాఫీ ఉద్యానపంటల రైతులకు వర్తింప చేయలేదు. దీంతో తాము వారి వివరాలు సేకరించడం లేదని కూడా బ్యాంక్‌ ప్రతినిధి ఒకరు చెప్పారు. వాస్తవంగా బ్యాంకులు మామిడి, పామాయిల్‌, ఇతర ఉద్యాన పంటలకు కూడా రుణాలు ఇస్తు న్నాయి. మరి ఉద్యాన పంటలకు రుణాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏమిటన్నది కూడా ప్రభుత్వమే నిర్ణయించాల్సి ఉందని చెబుతున్నారు. మొత్తం మీద నికరంగా ఈనెల 20 వతేదీకి గాని ఎంతమంది రైతులు బ్యాంకులకు తమ వివరాలు అందించారన్నది తెలియదు.