Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

తూర్పున జ్వరాలు ...

మంథని : జిల్లాలోని తూర్పు డివిజన్‌లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. పది రోజు ల్లో విష జ్వరాలతో ఆరుగురు మృత్యువాతప డ్డారు. తాజాగా శుక్రవారం కాటారం మండలంలో చిన్నారి, మహాముత్తారం మండలంలో మహిళ మృతి చెందారు. తూర్పు డివిజన్‌లో ఇటీవల వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. వీటి ప్రభావంతో వాగులు, వంక లు ఉప్పొంగి లోతట్టు గ్రామాల్లో తాగునీరు కలుషితం కావడంతో పాటు పారిశుధ్యం లో పించింది. దోమలు, ఈగలతో పాటు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణం గా సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. కొద్దో గొప్పొ డబ్బున్న వారు కరీంనగర్‌, హన్మకొండ, వరంగల్‌, హైదరాబాద్‌, గోదావరిఖని లాంటి ప్రాంతాలకు వెళ్లి వేలాది రూపాయ లు ఖర్చు చేసుకుని చికిత్స పొందుతుండగా నిరుపేదలు అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీలతోనే వైద్య సేవలు పొందుతున్నారు. దీంతో డివిజన్‌లోని మహదేవపూర్‌, మహాముత్తా రం, కాటారం, మల్హర్‌, మంథని, కమాన్‌పూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లోని ప్రజలు విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, వాంతులు, వి రేచనాలు, చికున్‌గున్యా లాంటి వ్యాధులతో స తమతమవుతున్నారు. సకాలంలో వైద్య సేవ లు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం చెంది న పెద్ది మధునక్క శుక్రవారం మృతి చెం దగా, ఈ నెల 2న గుండెపు పద్మ, 5న అసో దుల లక్ష్మిలు జ్వరంతో చనిపోయారు. కాటా రం మండలం ప్రతాపగిరికి చెందిన వంగపల్లి భానుశ్రీజ(7)అనే చిన్నారి శుక్రవారం డెంగ్యూతో మృతి చెందింది. మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చెందిన పెయ్యల బానయ్య ఈ నెల 6న డెంగ్యూతో మృతి చెందాడు. ఈ నెల 2న మల్హర్‌ మం డలం మల్లారంలో మేకల రాజయ్య డెంగ్యూ తో మృత్యువాత పడ్డాడు. ప్రాణాంతక పాల్సిఫారం మలేరియా బారిన పలువురు పడుతున్నారు. లోతట్టు, అటవీ గ్రామాలు కావడం తో వ్యాధుల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేక పోవడం, సకాలంలో వైద్య సేవలు అంద క పోవడం కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.
పీహెచ్‌సీలో పనిచేయాల్సిన సిబ్బంది, గ్రా మాల్లో సేవలందించాల్సిన ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉండని కారణంగానే గ్రామాల్లో వ్యాధు లు విజృంభించి ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, డీఎంఅండ్‌ హెచ్‌వోలు స్పందించి పీహెచ్‌సీల్లో డాక్టర్లు, సిబ్బంది, గ్రామాల్లో ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించడం తో పాటు వ్యాధుల నివారణ మార్గాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తూర్పు డివిజన్‌ ప్రజలు కోరుతున్నారు.

జ్వరాలతో ఇద్దరి మృతి

ప్రతాపగిరిలో డెంగ్యూతో మృతి
కాటారం : మండలంలోని చిద్నెపల్లి గ్రామపంచాయితీ పరిధి ప్రతాపగిరి గ్రా మానికి చెందిన వంగపల్లి భానుశ్రీజ (7) అనే విద్యార్థిని శుక్రవారం డెంగ్యూ జ్వరం తో మృతి చెందింది. సంపత్‌, శిరీష దంపతుల కూతురు భాను శ్రీజకు వారం క్రితం జ్వరం రాగా గారెపల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపో వడంతో గోదావరిఖనికి తీసుకెళ్లగాప్లేట్‌లెట్‌ కణాలు తగ్గాయని కరీంనగర్‌కు తీసుకెళ్లా లని అక్కడి వైద్యులు సూచించారు. కరీం నగర్‌ ఆసుపత్రిలో నాల్గు రోజులుగా చికిత్స పొందుతూ తీవ్రఅస్వస్థతకు గురై శుక్రవా రం మృతి చెందింది.

విషజ్వరంతో మహిళ మృతి
మహాముత్తారం : మండలంలోని బోర్లగూడెం గ్రామానికి పెద్ది మధునక్క(55) అనే మహిళ శుక్రవారం జ్వరం, విరేచనల తో మృతి చెందింది. జ్వరంతో బాధపడుతు న్న మధునక్క తీవ్ర అస్వస్థతకు గురికాగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా యామన్‌పల్లి సమీపంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.