Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

‘ఆఫ్‌షోర్‌కు అప్పయ్యదొర పేరు పెట్టాలి’


కాశీబుగ్గ: ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు అప్పయ్యదొర పేరు పెట్టాలని పలాస-కాశీబుగ్గ కాళింగ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం స్థానిక సిద్ధార్థ బాలికల జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో ఆ సంఘ అధ్యక్షుడు హెచ్‌.ఎండుదొర అధ్యక్షతన సంఘ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయనతో పాటు ప్రముఖ వైద్యుడు దువ్వాడ జీవితేశ్వరరావు, పైల రాజరత్నంనాయుడు విలేకరులతో మాట్లాడుతూ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌కు రిటైర్డు ఎస్‌ఈ వాసుదేవరావుతో ప్రాజెక్టు డిజైన్‌ వేయించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డితో ఆమోదింపజేసి న ఘనత అప్పయ్యదొనదేనని గుర్తు చేశారు. అటువంటి నిష్కళంక రాజకీయ నాయకుడి పేరును ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుకు పెట్టడం సముచితం అన్నారు. మాటకు కట్టుబడిన వ్యక్తిగా, నీతికి, నిజాయితీగా తుదివరకూ అదే పంథాలో జీవనం సాగించిన వ్యక్తిగా ఆయన నిలిచారన్నారు. సమావేశంలో కింతలి మురళీమోహన్‌, పైల సంజయ్‌, కె.బేబీరావు, ఎస్‌.సింహాచలం, పైల రమణ, పైల హేమాచలం, వి.వెంకట్రావు,హనుమంతు ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు. ్కలఉర