Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

రుణ మాఫీ వద్దు - అభివృద్ధి చాలు

విజయవాడ/ అజిత్‌సింగ్‌నగర్‌: వ్యవసాయ రంగాన్ని వదిలి ఆర్థి కంగా స్థిరపడిన తమకు రుణ మాఫీ చేయకుండా ఆ సొమ్ముతో తమ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ కంచికచర్ల ప్రాంతానికి చెందిన నన్నపనేని నాగేశ్వరరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను శుక్ర వారంప్రెస్‌ క్లబ్‌లో ట్రస్ట్‌ చైర్మన్‌ నన్నపనేని రాంబాబు ఆవిష్క రిం చారు. ఆయన మాట్లాడుతూ గతంలో వ్యవసాయ రంగంలో పని చేసి, నేడు ఆర్థికంగా బలపడిన వారందరిని ఒకే వేదికపై తీసుకువచ్చేందుకు వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం రద్దు చేయనున్న రుణాలతో తమ గ్రామాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నదే తమవెబ్‌సైట్‌ ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. వ్యవసాయం వదిలి ఉద్యోగం, ఇతర రంగాలలో స్థిరపడిన వారు తమ తమ ప్రాంతాల అభివృద్ధికి సహకరిప్తే పూర్త్తి స్థాయి మౌలిక సౌకర్యాల కల్పన సాధ్యమవుతుందని తెలిపారు. స్వచ్ఛందంగా తరలివచ్చే వారందరిని ఒక వేదికపైకి తీసుకొచ్చి, ఈ ప్రక్రియను విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో ట్రస్ట్‌ మెంబర్‌ డి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.