Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:54AM

అల్గునూర్‌లో విశ్వబ్రాహ్మణుల భూములు కబ్జా

కరీంనగర్‌ టౌన్‌: జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న అల్గునూర్‌ గ్రామంలో భూముల రేట్లు పెరిగినందున కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాదారులకు అసాంఘిక శక్తులు అండగా ఉంటున్నాయని, అమాయకులను కాపాడాలని లోక్‌సత్తా ఉద్యమసంస్థ ఒక ప్రకటనలో కలెక్టర్‌ను కోరింది. అల్గునూర్‌లో 501 సర్వే నెంబర్‌లో ఐ దుగురు విశ్వబ్రాహ్మణ కుటుంబాలకు చెందిన 7 ఎక రాల భూమి ఉంది. ఈ నెల 8న నర్సింహారెడ్డి అనే వ్యక్తి 105 సర్వే నెంబర్‌లో అతనికి భూములుంటే, 501 లోకి తనదేనంటూ చొచ్చుకొచ్చారని వారు కలెక్టర్‌కు ఫి ర్యాదు చేశారు. అలాగే కోమటిరెడ్డి రాజయ్య శ్రీనివాసచారికి చెందిన భూమిలో ప్రహరీగోడ నిర్మిస్తే, అది అక్రమమని పంచాయతీ కార్యదర్శి నోటీస్‌ జారీ చేశాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసినట్లు లోక్‌సత్తా తెలిపింది. అ లాగే గ్రామంలోని ప్రజాప్రతినిధులు కొందరు ఎలాంటి డాక్యుమెంట్లు లేకున్నా 595 సర్వే నెంబర్‌లో 11 గుంట ల భూమి ఉన్నట్లు రాయించుకున్నారని, పహణీలో, 1-బిలో ఆ భూమి తన సోదరుడి పేర ఉన్నట్లు లోక్‌సత్తా పేర్కొంది. మరో ప్రజాప్రతినిఽధి తన భార్యపేర ప్రభుత్వ భూముల్లో 16 గుంటల భూమి కబ్జా చేసుకున్నారని లోక్‌సత్తా పేర్కొంది. అల్గునూర్‌ భూముల వ్య వహారంపై సమగ్ర విచారణ చేయించి విశ్వబ్రాహ్మణులకు న్యాయం చేయాలని లోక్‌సత్తా జిల్లా బాధ్యులు ఎన్‌ శ్రీనివాస్‌, ప్రకాశ్‌హొల్లా, చంద్రప్రభాకర్‌, గంగారా వు, గంగాధర్‌, ఆర్‌విరావు తదితరులు విజ్ఞప్తి చేశారు.