Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:53AM

రోగులకు వల్లభనేని ట్రస్ట్‌ ఆర్థిక సాయం

గన్నవరం రూరల్‌ : వల్లభనేని అరుణ మెమోరియల్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా, సహాయ కార్యక్రమాల్లో భాగంగా పలువురు రోగులకు రూ. 40 వేల ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు మెండెం రాంబాబు అందజేశారు. తాము ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమకు వైద్య పరంగా సహాయం అందించాలని ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ని కోరారు. స్పందించిన వంశీ పలువురు రోగులకు పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు జరిపి మందులు అందజేశారు. ట్రస్టు నుంచి వైద్య సహాయం పొందిన గారపాడు గ్రామానికి చెందిన ప్రశాంత్‌, నాగవరప్పాడు చెందిన సి.హెచ్‌.శ్రీనివాసరావు, జంక్షన్‌కు చెందిన సయ్యద్‌ మసరతి, పి.బి.సుబ్రమణ్యం, కె.రేవతి, కె.డేవిడ్‌, రాజులకు రూ.36 వేలు, వెంట్రప్రగడకు చెందిన జి.సంతోష్‌, దుర్గాపురంకి చెందిన పి.శశికళలకు చెరో రెండు వేల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎ.అంబేద్కర్‌, పట్రా కొండలు, సి.హెచ్‌.చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.