Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:53AM

ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ఇబ్రహీంపట్నం: విద్యార్థులు ప్రతిభ కనబరచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామిక వేత్త ఆర్‌.తులసీధరన్‌ అన్నారు. డాక్టర్‌ జకీర్‌ హుస్సేన్‌ కళాశాల ఆధ్వర్యంలో కళాశాల నూతన విద్యార్థులకు ఫ్రెషర్స్‌ డేను శుక్రవారం కళాశాల ఆవరణలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ మహబాష అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిఽథిగా హాజరైన తులసీధరన్‌ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు నిర్ధిష్టమైన లక్ష్యం పెట్టుకొని ఆత్మవిశ్వాసంతో సాగితే ఏదైన సాధించవచ్చన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం పెంచుకోవాలని తెలిపారు. విద్యాభ్యాసం అనంతరం జీవితంలో స్థిర పడిన ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత సామాజిక సేవకు వినియోగించాలని కోరారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్‌ మహబాష మాట్లాడుతూ కళాశాలలో క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. కళాశాలలో చదివిన విద్యార్థులు పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో స్థిరపడినట్లు తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాంపులతో విద్యార్థులలో సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులలో స్నేహ, సోదర భావాలు కలిగిఉండేందుకు ఫ్రెషర్స్‌ డే వంటి కార్యక్రమాలు దోహదపడతాయాని తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఫ్రోగ్రామ్‌ అధికారులు జాఫర్‌ సాధిక్‌, ఎస్‌.మస్తాన్‌ వలి, సురేష్‌, అధ్యాపకులు రాంబాబు, భేగ్‌, ఆలీ, రాంప్రసాద్‌, నాగుల్‌మీరా, పుల్లయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.