Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:52AM

విద్యార్థులు ఎన్టీఆర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

గవర్నర్‌పేట : నేటితరం విద్యార్థులు తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన స్వర్గీ య నందమూరి తారకరామారావును ఆదర్శం గా తీసుకుని ముందుకు సాగాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కోరారు. ఎస్‌ఆర్‌ ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రథమ, ద్వితీయ యూనిట్ల ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా స్థాయి వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బొండా ఉమా మా ట్లాడుతూ ఇదే కళాశాలలో చదివిన ఎన్‌.టి. రామారావు దేశం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారన్నారు. ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ నినాదంతో దేశంలో తెలుగు వారికి గుర్తింపు లభించిందన్నారు. ప్రతి విద్యార్థి అన్న ఎన్టీఆర్‌ను ఆదర్శం గా తీసుకుని తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ ఆత్మగౌరవంతో ముందుకు సాగాలన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ కళాశాలల్లో వసతులు పెంచేందుకు ముఖ్యమంత్రి చేస్తు న్న కృషిని వివరించారు. కార్యక్రమంలో ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, జూనియర్‌, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఎం. రాజారావు, డాక్టర్‌ వి.రవి, అయిదో డివిజన్‌ కార్పొరేటర్‌ కంచర్ల నాగవెంకట శేషారాణి, అధ్యాపకులు కనిగంటి భాస్కరరావు తదితరు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన క్లాసికల్‌ డ్యాన్స్‌ విశేషంగా ఆకట్టుకుంది.