Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:52AM

భవన నిర్మాణాలకు అడ్డుగోలుగా అనుమతులిస్తే.. ఇంటికే

పెనమలూరు: ప్రభుత్వ విధులు నిర్వహించే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామాల్లో అడ్డగోలుగా భవన నిర్మాణాలకు అనుమతులిస్తే ఇంటికెళ్ళిపోతారు జాగ్రత్త అంటూ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరంకిలో శుక్రవారం నియోజక వర్గ అధికారులు, ప్రజాప్రతినిధుల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధులతో తీర్మానం ప్రకారం అభివద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని, వ్యక్తిగత మరుగుదొడ్లు లబ్ధ్దిదారులను ఎంపిక చేసి నిర్మాణానికై అంచనాలు రూపొందించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేసుకోవాలని, కావల్సిన స్థలాన్ని ఆయా గ్రామ కార్యదర్శులు సేకరించకోవాలన్నారు. పంచాయతీ మంచినీటి ట్యాంక్‌ని 15 రోజులకొకసారి శుభ్రం చేసి పరిశుభ్రత కల్గిన మంచినీరుని ప్రజలకు అందించాలన్నారు. గ్రామాల్లో అక్రమంగా ఇచ్చిన మంచినీటి పైప్‌లైన్‌ కనెక్షన్లు నుంచి ఫీజు వసూలు చేసి రెగ్యులరైౖజ్‌ చేయాలన్నారు. గ్రామాల్లో అనధికార లేఅవుట్లను గుర్తించి కార్యదర్శులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో కార్యదర్శులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పించన్లకు ఆధార్‌ లింక్‌ చేసి అందించేలా అధికారులు బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శులు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, జెడ్‌పీటీసీ సభ్యులు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.
పెనమలూరు పీహెచ్‌సీ
ఆధునీకరణకు పరిశీలన
పెనమలూరు ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం ఆధునీకరణకు వీపీహెచ్‌ఎన్‌ఐడీసీ ఇఇ లక్ష్మినారాయణను శుక్రవారం పెనమలూరు ఎమ్మెల్యే బోడేప్రసాద్‌ కలిసి పరిశీలించారు. పెనమలూరు మండల జనాభా లక్షా 50 వేల మందిగాను 24 ఉప ఆరోగ్య కేంద్రాలున్నప్పటికి ప్రధానంగా రోగులు పెనమలూరు పీహెచ్‌సీకే రావటం జరుగుతుంది. దీంతో రోగులకు కావాల్సిన వసతులు లేకపోవటంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.ఇటీవల గ్రామాల పర్యటనలో ఎమ్మెల్యే బోడే దృష్టికి తీసుకురావటంతో ఆయన వెంటనే స్పందించి పీహెచ్‌సీని ఆధునీకరణ చేపడతానని హామీ ఇచ్చారు. దీంతో ఆసుపత్రిలో రోగులకు వసతులు కల్పించటానికి మరో అంతస్తు భవనాన్ని నిర్మించటానికి అధికారులతో ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో కంకిపాడు ఎస్‌పీహెచ్‌ఓ లోక్‌మోహన్‌, స్థానిక నేతలు మారుపూడి ధనకోటేశ్వరరావు, గ్రామ ఉపసర్పంచ్‌ అరవపల్లి చంటి, మండల వైస్‌ ప్రెసిడెంట్‌ కోయా ఆనంద్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.
నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం
యనమలకుదురుకు చెందిన వ్యక్తి ప్రమాదానికి గురై ఆర్థికంగా ఇబ్బందులకు గురికావడంతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌ ఆ కుటుంబానికి 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.యనమలకుదురుకి చెందిన మర్ది ఏడుకొండలును ఇటీవల గుర్తుతెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గాయపడిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలవడంతో ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వర్గాల వారితో మాట్లాడి రోగి ఆరోగ్య పరిస్థితి అడిగి తెల్సుకొని మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.