Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:52AM

ఆంధ్రాబ్యాంక్‌ యాజమాన్య నిరంకుశ వైఖరిపై ధర్నా

వన్‌టౌన్‌ : ఆంధ్రాబ్యాంక్‌ యాజమాన్యం ఉద్యోగ సంఘాలతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు స్వీపర్లకు వేతన పెంపుదల, పదోన్నతి కల్పించడం లో విఫలమైందని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జోనల్‌ కార్యదర్శి పి.నారాయణరావు అన్నారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అవార్డు స్టాఫ్‌, స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని, యాజమాన్య మొండివైఖరిని నిరసిస్తూ బ్యాంక్‌ అవార్డు ఎంప్లాయిస్‌యూనియన్‌ సభ్యులు శుక్రవారం వన్‌టౌన్‌లో జోనల్‌ కార్యా లయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన 500 శాఖల్లో శాశ్వత, సబ్‌స్టాఫ్‌, స్వీపర్లు లేరని ఆవేదనవ్యక్తం చేశారు. వెంటనే ఆ ఖాళీలు భర్తీ చేయాలనీ, బ్యాంకుకు కేటాయించిన క్లర్కులకు సత్వరం నియామక ఉత్తర్వులివ్వాలని పేర్కొన్నారు. ధర్నాలో ఏఐటీ యూసీ నగర అధ్యక్షులు టి.రమణమూర్తి, జిల్లా బ్యాంక్‌ ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌.హనుమంతరావు, కె.ఎస్‌.రావు, విజయవాడ బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షులు కె.రాధాకృష్ణ, ఏఐబీఈఏ యూనియన్‌ సం యుక్త ప్రధాన కార్యదర్శి కె.నగేష్‌కుమార్‌, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.శారద, డిప్యూటీ జోనల్‌ కార్యదర్శులు ఎస్‌.ఆర్‌.ఆంజనేయులు, వి.శివనాగేశ్వరరావు, కోశాధికారి జి.శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.