Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:52AM

కళానీరాజనం తుది ఎంపిక పోటీలు

విజయవాడ కల్చరల్‌ : సప్తగిరినివాసుడు వేంకటేశ్వరుని వివిధ రూపాల్లో కీర్తిస్తూ నృత్య కళాకారుల బృందం కూచిపూడి విన్యాసాలతో కళానీరాజనం అర్పించారు. టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మ లపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్న నాదనీరాజనం తుది ఎంపిక పోటీలు శుక్రవారం కన్నుల పండువగా జరిగాయి. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుం టూరు జిల్లాలకు చెందిన 23 బృందాలు సత్తాచా టాయి. నారాయణతీర్థ తరంగాలు, దశావతార శబ్దం, అన్నమాచార్య సంకీర్తనతో స్వామిని ప్రేక్షకుల మనసుల్లో సాక్షాత్కరిస్తూ నృత్య కళాబృందా లు అద్భుత రూపకాలను ప్రదర్శించారు. పి.శిరీ షా, జి.సత్యనందిని, జి.పావనీసుధా, సప్పాశివకుమార్‌, అనూషానాయుడు, వాగ్దేవి ప్రసాద్‌, డింపుల్‌శ్వేత, సి.హెచ్‌.శ్రీనివాస్‌, వి.విజయానంద్‌, భాగవతుల వెంకటరామ శర్మ, డి.అపర్ణ, కె.లక్ష్మి ప్రసన్న, ఎన్‌.ఉషానాయుడు, చంద్రిక, పద్మశ్రీ హేమంత్‌, బృందాలతోపాటు మరి కొన్ని బృందాలు చక్కని నృత్య ప్రదర్శనలు చేశాయి. కార్యక్రమంలో టీటీడీ ఆల్‌ప్రాజెక్ట్స్‌ డిప్యూటీ ఈవో బి.శారదా, ఎం.ఎస్‌.కె.కుమార్‌, సి.వి.కె.ప్రసాద్‌, నాగలింగం శివాజీలు పాల్గొన్నారు.
భక్తి పారవశ్యంలో భక్తమార్కండేయ హరికథ
విజయవాడ కల్చరల్‌ : నిరాఘాటం పద్మావతి గానం చేసిన భక్తమార్కండేయ హరికథ ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సత్యనారాయణపురం శివరామకృష్ణక్షేత్రంలో శుక్రవారం మూత్రపిండాల జబ్బు చికిత్స కోసం ఆర్థిక సహాయాన్ని అర్ధిస్తూ మృత్యుంజయుడైన మార్కెండేయుని కథ గానం చేయడం ప్రేక్షకుల మనసులను కదిలించింది. కథాగానానికి వయోలిన్‌ పాణ్యం దక్షిణామూర్తి, మృదంగం చింతాసూర్య ప్రకాష్‌ వాయిద్య సహకారమందించారు.