Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:47AM

ఏరియా ఆస్పత్రిలో వివాదం

నర్సీపట్నంటౌన్‌: నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యుల మధ్య సమన్వయలోపం వివాదానికి దారితీసింది. ఇందుకు సంబంధించి బాఽధితులు అందించిన వివరాలివి. నర్సీపట్నానికి చెందిన మావూరి శ్రీనుకు 15 రోజుల క్రితం కాలికి దెబ్బతగలడంతో ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు చక్కెర వ్యాధి ఉండడంతో ఆ వ్యాధి తగ్గేవరకు ఆస్ప్రతిలో ఉంచి వైద్యసేవలందించారు. ఆస్పత్రి ఎముకల వైద్యులు డాక్టర్‌ సుధాకర్‌ గురువారం శ్రీను కాలికి ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించి ఏర్పాట్లు చేశారు. శ్రీను కాలికి ఆపరేషన్‌ జరుగుతుండగా మధ్యలో జనరేటర్‌ ఆగిపోవడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆస్పత్రి పర్యవేక్షణ అధికారి డాక్టర్‌ దొరని జనరేటర్‌లోకి ఆయిల్‌ తెప్పించాలని ఎముకల వైద్యులు సుధాకర్‌ కోరారు. అక్కడ ఇద్దరి వైద్యుల మధ్య ఎటువంటి సంభాషణ నడిచిందో గాని ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటి తరువాత వైద్యుడు సుధాకర్‌ ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చి వెళ్లిపోయారు. దీంతో రోగి బంధువులు మీడియాకు, ప్రజాప్రతినిధులకు ఫోన్లలో ఫిర్యాదు చేశారు. శస్త్ర చికిత్సను మధ్యలోనే ఆపేశారని రోగి ప్రాణానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని రోగి తరపు స్నేహితులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దొర వద్ద వాగ్వివాదానికి దిగారు. ఈలోగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ సన్యాసిపాత్రుడు, ఇద్దరు వైద్యులను మున్సిపల్‌ కార్యాలయానికి రప్పించి మాట్లాడారు. వైద్యులు సమన్వయంలో పనిచేసి ఆస్పత్రికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. జనరేటర్‌లోకి ఆయిల్‌ తెప్పించుకొని నిల్వ చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రిలో ఏంజరిగిందో చెప్పాలని ఆర్థోపెడిషియన్‌ డాక్టర్‌ సుధాకర్‌ను ఆయన ప్రశ్నించగా రోగి కాలికి గురువారం రోజునే పూర్తయినట్టు తెలిపారు.ఈ విషయం ఆస్పత్రి పర్యవేక్షణాధికారికి తెలియదు.