Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:47AM

రావికమతం మండలంలో మరో నలుగురికి డెంగ్యూ

రావికమతం: మండలంలో మరో నలుగురికి డెంగ్యూ జ్వరం సోకడంతో విశాఖ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కన్నంపేట గ్రామానికి చెందిన గుదే కొండలరావు(35), కేబీపీ అగ్రహారానికి చెందిన చిక్కాల రమణమ్మ(30), గర్నికం గ్రామానికి చెందిన దాసరి చిన్నమ్మ, జడ్‌.కొత్తపట్నం పంచాయతీ శివారు పి.ధర్మవరానికి చెందిన జి.నారాయణరావులకు జ్వరం సోకడంతో విశాఖలోని కేజీహెచ్‌, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరారు. గర్నికం గ్రామానికి చెందిన ఆర్లి శ్రీను డెంగ్యూతోనే మృతిచెందగా, కేబీపీ అగ్రహారానికి చెందిన చిక్కాల హరిత కేజీహెచ్‌లో చికిత్స పొంది ప్రాణాపాయం నుంచి బయటపడింది. కొండలరావుకు వారం రోజుల నుంచి జ్వరం అదుపులోకి రాకపోవడంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అక్కడి వైద్యులు డెంగ్యూగా నిర్ధారించినట్టు తెలిసింది. చిక్కాల రమణమ్మకు కూడా పది రోజులుగా జ్వరం తగ్గుముఖం కాకపోవడంతో కేజీహెచ్‌కు తరలించారు. ఈమెకు కూడా డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు తేలడంతో చికిత్స అందిస్తున్నారు. దాసరి చిన్నమ్మలకు వారం రోజులుగా జ్వరం తగ్గుముఖం పట్టకపోవడంతో విశాఖ డెయిరీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. జి.నారాయణరావు కూడా విశాఖ డెయిరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరికి సకాలంలో పరీక్షలు నిర్వహించి, వైద్యం అందజేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు.