Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:46AM

సిబ్బంది స్థానికంగా ఉండకపోతే హెచ్‌ఆర్‌ఏ కట్‌

రాంబిల్లి: పీహెచ్‌సీ సిబ్బంది స్థానికంగా ఉండకపోతే హెచ్‌ఆర్‌ఏ కట్‌ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ శ్యామల హెచ్చరించారు. శుక్రవారం ఆమె రాంబిల్లి పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పీహెచ్‌సీలోని ఓపీ గదిని, ఆప్‌రేషన్‌లు చేసే గదిని, రోగులు ఉండే గదిని, రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌సీలో పరిసరాలను చూసి ఆమె వైద్యాధికారిణి రేష్మ, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత ఉందా అని అడిగి పొదుపుగా మందులను వాడాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె సిబ్బందిని ప్రశ్నించారు. సిబ్బంది సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారా అని ఆమె వైద్యాధికారిణి రేష్మను అడిగారు. ఓపీ గదిలో పారిశుధ్యం పరిస్థితిని చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో సిబ్బంది బాధ్యతగా పనిచేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యాధికారిణితో సహా సిబ్బంది స్థానికంగా ఉండాలని సూచించారు. పీహెచ్‌సీలో వైద్యం సక్రమంగా అందడంలేదని రోగులు నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు. ఈకార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ ఎస్‌పీహెచ్‌వో డాక్టర్‌ పి.ఎస్‌ సత్యన్నారాయణ పాల్గొన్నారు.
గొడిచెర్ల పీహెచ్‌సీ తనిఖీ
నక్కపల్లి: మండలంలోని గొడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి,సిబ్బంది పనితీరు, నిర్లక్ష్యంపై జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ శ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం ఆమె గొడిచెర్ల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఆస్ప్రతిలోని లేబర్‌రూమ్‌, జనరల్‌వార్డు,స్టోర్‌ రూమ్‌లను పరిశీలించిన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆక్సిజన్‌ లేకుండా తుప్పుపట్టి వున్న ఆక్సిజన్‌ సిలిండర్‌ను చూసిన ఆమె వైద్యాధికారి, సిబ్బందిపై మండిపడ్డారు. ఇక్కడ సిబ్బంది స్థానికంగా ఉండడంలేదని తెలుసుకున్న ఆమె వైద్యాధికారి సహా, సిబ్బంది హెచ్‌ఆర్‌ఏను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. హెచ్‌ఆర్‌ఏ లేని సిబ్బంది జీతాలు కూడా నిలిపివేస్తామని ఆమె చెప్పారు. ఇక్కడ ఆస్పత్రిలో రోగులకు సరైన సేవలందించడంలేదని వైస్‌ ఎంపీపీ వైబోయినరమణ, ఆ గ్రామానికి చెందిన నల్లలరామకృష్ణ డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు సబ్‌ సెంటర్లలో ఉండాలని లేనట్టయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పాయకరావుపేటలో...
పాయకరావుపేట:పాయకరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధ్వానంగా ఉందని, మూడు రోజుల్లో సిబ్బంది పనితీరు మార్చుకొని ఆస్పత్రిని మెరుగుపరచకుంటే క్రమ శిక్షణ చర్యలు తప్పవని డీఎంహెచ్‌వో ఆర్‌.శ్యామల హెచ్చరించారు. శుక్రవారం పాయకరావుపేట పీహెచ్‌సీలో తనిఖీ నిర్వహించిన ఆమె ఆస్పత్రి పరిసరాలు అధ్వానంగా ఉండడంపై సిబ్బందిని నిలదీశారు. వైద్యాధికారి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్లిపోవడంపై ఆగ్రహం వక్తం చేశారు. ఆస్పత్రిలో పడకలు సరిగా లేకపోవడం, రికార్డులు అప్‌డేట్‌ చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్థానికంగా ఉండనందున వైద్యాధికారి హెచ్‌ఆర్‌ఏని కట్‌ చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌ఈవో మండలంలోని శ్రీరాంపురం పీహెచ్‌సీని తనిఖీచేసి సంతృప్తి వ్యక్తంచేశారు. ఎంపీహెచ్‌ఈవో సింహాచలం తదితరులున్నారు.



జలటశో0