desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:46AM

డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలచేయాలి


బెలగాం: ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ ఎ.జగన్మోహన్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ విష యమై శుక్రవారం స్థానిక సుందరయ్య భవ నంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గోడపత్రిక విడు దల చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం నిరు ద్యోగ యువత ఎదురు చూస్తుందన్నారు. డీఎ స్సీ ద్వారా ఉపాధ్యాయులు వస్తారని పాఠశా లల్లో విద్యావాలంటీర్లను నియమించలేదని, విద్యార్ధుల చదువులు గాల్లో కలిసిపోతున్నా యన్నారు. ఈ 5న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడు దల చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీని వాసరావు అనేక సందర్భాల్లో ప్రకటించారని, ఇప్పుడు కేంద్రం ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే అని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికే అనేక మంది నిరుద్యోగ యువత కోచింగ్‌ కేంద్రాల్లో ఫీజులు కట్టి అద్దె గదుల్లో కష్టాలు పడుతూ డీఎస్సీ కోసం వేచి చూస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ మంత్రి 10,500 పోస్టులు తీస్తామని, ఆర్ధిక శాఖ మంత్రి 7,500 పోస్టులకే క్లియరెన్స్‌ ఇచ్చామని చెబుతున్నారని, వాస్తవానికి ప్రభుత్వం గుర్తిం చిన 42 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటి ఫికేషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విష యమై ఈ నెల 15న కలెక్టరేట్‌ వద్ద జరిగే ధ ర్నాలో నిరుద్యోగ యువతీ యువకులంతా పా ల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు టి.రమేష్‌, బి.కొండలరావు, కె.అనిల్‌, ఎం.కేశవరావు పాల్గొన్నారు.