Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

గ్రామీణ యువజన సంఘం సేవలు అభినందనీయం

మునగపాక: కళారంగాన్ని ప్రోత్సహిస్తున్న గ్రామీణ యువజన సంఘం సేవలు అభినందనీయమని ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పీలా గోవింద సత్యనారాయణ అన్నారు. గ్రామీణ యువజన మందిరం స్వర్ణోత్సవాలను మునగపాక కళావేదికపై జ్యోతి వెలిగించి శుక్రవారం రాత్రి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతీ ఏటా నాటకాలను ప్రోత్సహిస్తున్న యువజన మందిర్‌ సేవలు అభినందనీయమన్నారు. పట్టణాల్లోనే నాటకాలకు ఆదరణ తగ్గి పోతున్న ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఏటా నాటకాల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రైవేట్‌ గ్రంథాలయం స్థాపించి వివిధ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కళావేదికను ఆడిటోరియంగా మార్చేందుకు విశాఖ డెయిరీ చైర్మన్‌ తులసీరావు సహకారంతో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం యువజన మందిరం అధ్యక్షుడు సూరిశెట్టి రామ అధ్యక్షతన జరిగింది. ఎంపీపీ ఆడారిమంజు, జడ్పీటీసీ లక్ష్మీ సత్యనారాయణ, ఆర్‌ఈసీఎస్‌ మాజీ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు. సినీ నటుడు కోట శంకర్రావును ఘనంగా సన్మానించారు.

0ోల