Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

మరమ్మతులకు నోచుకోని ‘వట్టిగెడ్డ’


సాలూరు: జాతీయ రహదారిలోని కొట్టక్కి గ్రామ సమీపంలో ఉన్న వట్టిగెడ్డ వంతెన పూర్తిగా శిఽథిలావస్థకు చేరుకుంది. నూతనంగా రూ.ఆరున్నర కోట్లతో బ్రిడ్జిపనులు చేపడు తున్నారు. ఈ పనులు పూర్తికాకముందే పాత వంతెనను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. తుఫాన్‌కు వంతెన పూర్తిగా గోతులుగా మా రింది. దీంతో వాహనాల రాకపోకల సమయం లో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రయా ణికులు ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ ల్లో అయితే వంతెనపై పాదచారులు కూడా నడవటానికి భయాందోళన చెందుతున్నారు. నూతన వంతెన నిర్మాణం పూర్తి అయ్యేలోగా పాత వంతెన కూలిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు భావిస్తున్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి వంతెనకు మరమ్మతు లు చేపడితే బాగుంటుంది.
కూరగెడ్డపై వంతెన నిర్మించండి
సాలూరు రూరల్‌: పెదపారన్నవలసకు రాకపోకల నిమిత్తం కూరగెడ్డపై వంతెన నిర్మించాలని ఆ గ్రామస్థులు కోరారు. ఈ గ్రామానికి రావడానికి ఒక వైపు వేగావతి నది వుండగా, మరో వైపు కూరగెడ్డ వుందన్నారు. దీనివల్ల వర్షకాలం రాకపోకలకు తీవ్ర అంతరా యం కలుగుతుందన్నారు. అందువల్ల కూరగెడ్డపై వంతెన నిర్మిస్తే ఇబ్బందులు తప్పుతాయని పలువురు కోరుతున్నారు.: 1కలగీదీరౖ