Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

అంగన్‌వాడీ నియామకంపై విచారణ

సీలేరు: ధారకొండ పంచాయతీ దబ్బకోట అంగన్‌వాడీ కార్యకర్త నియామకం విషయంలో వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం ప్రజాప్రతినిధులు, అధికారులు విచారణ నిర్వహించారు. ఈ ఇంటర్య్యూకు దబ్బకోట, కొంగపాకలు నుంచి ఇద్దరు మహిళలు హాజరుకాగా, కొంగపాకలుకు చెందిన మహిళను ఎంపిక చేశారు. ఈ ఎంపికను వ్యతిరేకిస్తూ అఽధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు విచారణ చేపట్టి స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. విచారణ జరిపిన అంశాలను అధికారులకు నివేదిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్‌ పీవో దుర్గావరలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, వైస్‌ ఎంపీపీ కాసులమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు నళినీకృష్ణ, ధారకొండ సర్పంచ్‌ రాజు పాల్గొన్నారు.