Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Sep 13 2014 @ 01:45AM

విధుల్లో అలసత్నాన్ని సహించం



ముంచంగిపుట్టు: విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అరకులోయ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు అధికారులకు హెచ్చరించారు. స్థానిక కల్యాణ మండపంలో శుక్రవారం ‘మీ ఎమ్మెల్యేతో ఒక రోజు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ శాఖల మండల అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ప్రజలకు అధికారులంతా నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులకు తెలియజేయాలన్నారు. ప్రతి శనివారం వారపు సంత రోజు ఆయా శాఖల అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరుకాని వివిధ శాఖల అధికారులపై ఆయన మండిపడ్డారు. తీరును మార్చుకోవాలని వారిని హెచ్చరించారు. అలాగే సమావేశానికి గైర్హాజరైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో బాపిరాజును ఆదేశించారు.
వైసీపీ నాయకులపై ఫిర్యాదు
అంగన్‌వాడీ పోస్టులు ఇప్పిస్తామని వైసీపీ నాయకులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ఫిర్యాదు చేశారు. అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ విషయం పరిశీలించి న్యాయం చేస్తానని బాధితులకు ఎమ్మెల్యే కిడారి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.